Drunk policeman dances with bar girls మందుకోట్టి చిందులేసిన పోలీసు

Drunk policeman showers money dances with bar girls

policeman drunk onduty, policeman dances on duty with bar girls, policeman showers money on bar girls, Vyas Singh, bar girls, money, liqour, dance, Shravasti police station, Kambhari village, Uttar Pradesh

In a bizarre incident, a drunk policeman, named Vyas Singh, of the Shravasti police station in Uttar Pradesh, was caught dancing with bar girls, showering money on them while on duty.

‘‘చేతిలో డబ్బులున్నాయ్ వేస్తా బామ’’.. తాగుబోతు పోలీసు చిందులు

Posted: 05/04/2017 04:49 PM IST
Drunk policeman showers money dances with bar girls

ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోమారు వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏ ప్రజాపతినిధి చేత అక్షింతలు వేయించుకుంటూనో.. ఏ రాజకీయ నేతల చేత దెబ్బలు తింటూనో.. లేక ఏ అభాగ్యుడినో చావుదెబ్బలు కొట్టినందువల్లనో కాదు.. కానీ తన విధులు మర్చిపోయి.. అసలు పోలీసునన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. బార్ డాన్సర్లతో చిందులు వేస్తూ కెమెరాకు చిక్కి అడ్డంగా దోరికిపోయి వార్తల్లో నిలిచాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో శ్రావస్తి జిల్లాలోని కంభారి గ్రామంలో జరిగింది.

ఓ పెళ్లి వేడుకకు హాజరైన పోలీసు తాను అన్ డ్యూటీలో వున్నానన్న విషయాన్ని మర్చిపోయాడు. తన విధులకు స్వస్తి పలికి పెళ్లికి వచ్చిన పెద్దలతో కలసి కాసింత మధ్యం సేవించారు. వివాహ సందర్భంగా అక్కడ అమ్మాయిల డాన్సును కూడా ఏర్పాటు చేశారు. అందులో బార్ డాన్సర్లతో ఆ పోలీసు కాలు కదుపుతూ లయబద్దంగా నృత్యం చేశాడు. అంతేకాదు తన చేతిలోకి ముందుగానే తీసిపెట్టుకున్నా నోట్లను వాళ్ల మీదకు విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అందులోనూ అతగాడు యూనిఫాంలో ఉండే ఇదంతా చేయడం గమనార్హం.

    

శ్రావస్తి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి అతడు విధి నిర్వహణ కోసం వెళ్లాడని, తీరా అక్కడ వరకు వెళ్లిన తర్వాత తాగేసి బార్ డాన్సర్లతో డాన్సులు చేశాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా వెళ్లింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఈ విధంగా వార్తల్లో నిలవడం పరిపాటిగా మారింది. ఇదివరకు కూడా చాలా సందర్భాలలో ఇలా డాన్సులు చేస్తూ అక్కడి పోలీసులు వార్తలో నిలిచారు. అయితే కొత్తగా ఏర్పడిన యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలను కూడా పక్కనబెట్టి మరీ డాన్స్ చేయడమే చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పోలీసుపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vyas Singh  bar girls  money  liqour  dance  Shravasti police station  Kambhari village  Uttar Pradesh  

Other Articles