Mini Truck falls into canal 14 Died in Etah

Mini truck falls in canal 14 died

Etah Road Accident, UP Accident, UP Road Accident, Uttar Pradesh Road Accident, Mini Truck Accident, Uttar Pradesh Road Mishap, Uttar Pradesh Accident, Etah Truck Accident, Wedding Party Members Died, Truck Falls Canal, Uttar Pradesh Etah, Etah 14 Kill, Mini Truck Accident, Wedding Batch Accident

14 dead, 24 injured as mini-truck with wedding party falls into canal in Etah Uttar Pradesh.

పెళ్లి బ్యాచ్ కి యాక్సిడెంట్.. 14 మంది మృతి

Posted: 05/05/2017 09:15 AM IST
Mini truck falls in canal 14 died

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 14 మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎటా జిల్లాలో వివాహానికి హాజరయ్యేందుకు కొందరు ఓ మినీట్రక్కు(డీసీఎం)లో బయలుదేరారు. సరై నీమ్ ప్రాంత సమీపంలో ట్రక్కు అకస్మాత్తుగా పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఘటనా స్థలంలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి తెలియగానే జిల్లా జడ్జి, ఎఎస్పీ లు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

గాయపడిన వారిని ఆగ్రా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కళ్ల ముందే బంధువులు, సన్నిహితులు ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి వరకు ఆనందంగా వస్తున్న వారు విషాదంలో మునిగిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Etah  Road Accident  

Other Articles