Anchor Anasuya Injured in Car Accident రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యాంకర్ అనసూయ

Anchor anasuya met with an accident near anantapur

Anasuya met with an accident near Anantapur and she has survived with minor injuries, which took place near Guttur Mandal in Anantapur district.

Anasuya met with an accident near Anantapur and she has survived with minor injuries, which took place near Guttur Mandal in Anantapur district.

రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యాంకర్ అనసూయ

Posted: 05/03/2017 06:18 PM IST
Anchor anasuya met with an accident near anantapur

ఇటు తెలుగు చిత్రాలలో నటిస్తూనే అటు బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన యాంకర్‌ ప్రమాదంలో చిక్కుకున్నారు. అమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తెలుగు బుల్లితెర అభిమానులు అందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో అమె స్వల్ప గాయాలతో భయటపడిందని తెలిసి అమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అమె ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకోనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.

బెంగుళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్ కు పయనమైన అమె కారును అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో మరో కారు ఢీకొట్టిడంతో అమె ప్రమాదం బారిన పడ్డారు. అయితే స్వల్ప గాయాల పాలైన అమె మరో కారులో అనంతపురం చేరుకున్నారు. రాప్తాడులోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. అయితే అమె హైదరాబాద్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని.. అనంతపురంలోనే ఇవాళ విశ్రాంతి తీసుకుని తరువాత హైదరాబాద్ కు తిరిుగు పయనం అవుతారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anasuya. telugu tv anchor  guttur mandal  anantapur  accident  tollywood  

Other Articles