Pawan Kalyan Support Mirchi Farmers over MSP రైతు రోడ్డెక్కితే ప్రభుత్వాలకు మంచిది కాదు: పవన్ కల్యాన్

Pawan kalyan support mirchi farmers over mirchi farmers maximum support price

Pawan Kalyan Support Mirchi Farmers, jana sena support Mirchi Farmers, Pawan Kalyan Mirchi Farmers, Jana Sena Mirchi Farmers, power star pawan kalyan, pawan demands Rs 11000 msp, janasena demands Rs 11000 msp, pawan kalyan, jana sena, mirchi farmers, government failure, msp, telangana, andhra pradesh

Jana Sena Chief Pawan Kalyan demanded Governments to ensure the price of mirchi doesn't fall below Rs 11,000 per quintal, he held Governments responsible for the present situation of mirchi farmers.

రైతు కన్నీరు దేశానికి శ్రేయస్కరం కాదు: జనసేన

Posted: 05/02/2017 06:47 PM IST
Pawan kalyan support mirchi farmers over mirchi farmers maximum support price

వ్యవసాయ అధారిత దేశంలో రైతన్నలు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదని, అన్నదాతల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అందోళనకు దిగడం ప్రభుత్వాలకు కూడా మంచిది కాదని జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్‌ కల్యాన్ అవేదన వ్యక్తం చేశారు. పంటలు పండించే రైతే అకలి మంటల్లో చిక్కుకుని అక్రంధనలు పెట్టడం మన దేశంలో నెలకొన్న విచిత్రమైన పరిస్థితని దుయ్యబట్టారు. పెట్టుబడులు పెడుతున్నాయంటూ విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ప్రభుత్వాలు స్వాగతం పలుకుతున్నాయన్నారు.

అంతేకాకుండా ఆ సంస్థలకు భూమి, నీరు, లేబర్, విద్యుత్ వంటి వాటిని రాయితీలపై ఇస్తున్న ప్రభుత్వాలు.. దేశ జీడిపీలో కిలకపాత్ర పోషిస్తున్న రైతన్న విషయంలో అదే శ్రద్ద చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభత్వాల నుంచి అన్నదాలకు సాయం కొరవడటంతోనే రైతన్నలు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పవన్ కల్యాన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతుల ఆందోళనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రైతులు మిర్చి పంటను ఎంత విస్తీర్ణంలో వేయాలో రైతులకు ముందుగా తెలియజేయడంలో వ్యవసాయశాఖ విఫలమైయ్యారని అందుకనే సమస్య ఉత్పన్నమైందని అన్నారు. దీంతోనే పండిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. అయితే రైతులకు గిట్టుబాటు కల్పించడంలో మార్కెటింగ్‌ శాఖ వైఫల్యం చెందిదని తమ పార్టీ భావిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల పట్ల, వారి సమస్యల పట్ల చిన్నచూపు మాని క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. క్వింటాల్‌ మిర్చికి  రూ.11వేల చొప్పున‌ రైతుకు గిట్టుబాటుధర ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మార్కెట్లో ధరకు, గిట్టుబాటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలని ప‌వ‌న్‌ డిమాండ్‌ చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  mirchi farmers  government failure  msp  telangana  andhra pradesh  

Other Articles