bjp minister links links triple talaq to lust భార్యలను మార్చుకుని కామవాంఛ తీర్చుకుంటున్నారు..!

Swami prasad maurya links triple talaq to lust kicks up a row

triple talaq, triple talaq swami prasad maurya, triple talaq muslim men lust, swami prasad maurya lust comment, swami prasad maurya

Uttar Pradesh cabinet minister Swami Prasad Maurya said that Muslim men use triple talaq to change wives and satisfy their “lust”.

భార్యలను మార్చుకుని కామవాంఛ తీర్చుకుంటున్నారు..!

Posted: 04/30/2017 09:40 AM IST
Swami prasad maurya links triple talaq to lust kicks up a row

ట్రిపుల్ తలాఖ్ అంశంమే తమను అధికారంలోకి తీసుకువచ్చిందని ఉత్తర్ ప్రదేశ్ బీజేపి నేతలు ఓ వైపు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుండగా, ఉత్తరప్రదేశ్‌ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ట్రిపుల్‌ తలాఖ్ అంశాన్ని వారి కామవాంఛ తీర్చుకునేందుకు వినియోగిస్తున్నారని వివిదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని అడ్డంగా పెట్టుకుని భార్యలను మారుస్తూ తమ ‘కామాన్ని’ సంతృప్తి పరుచుకుంటున్నారని అన్నారు. ట్రిపుల్ తలాఖ్ కు ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన పేర్కోన్నారు.

ముస్లిం మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తేల్చిచెప్పారు. ట్రిపుల్ తలాఖ్ అనేది అహేతుకమైనది. నిరంకుశమైనదని అన్నారు.. ఒక వ్యక్తి తన కోరికను సంతృప్తికోవడానికి తరచూ భార్యలను మార్చి.. సొంత భార్యాపిల్లలను వీధులపాలు చేసి అడ్డుక్కుతినమన్న విధానం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ విధానాన్ని ఎవరూ అంగీకరించరని అయన పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, దీనిపై పరిష్కారానికి ముస్లిం సామాజికవర్గం ముందుకురావాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swami Prasad Maurya  triple talaq  UP Cabinet  controvesry row  

Other Articles