Police brutally thrashes old rickshaw-puller in UP సోషల్ మీడియా ఉద్యోగం ఊస్ట్ చేసింది..

Lucknow grp constable suspended for thrashing rickshaw puller

constable beats rikshaw, lucknow cop thrashes rikshaw puller, govt railway police, cop thrashes rikshaw guy viral video, charbagh station lucknow, india news

A GOVERNMENT Railway Police (GRP) constable was suspended after a video showing him thrashing a rickshaw-puller near Charbagh station in Lucknow went viral

సోషల్ మీడియా ఉద్యోగం ఊస్ట్ చేసింది..

Posted: 04/30/2017 08:48 AM IST
Lucknow grp constable suspended for thrashing rickshaw puller

రిక్షా కార్మికుడు.. అందులోనూ వృద్దుడు.. కనీసం వయస్సుకు కూడా మర్యాదు ఇవ్వకుండా విచక్షణ కొల్పోయి అతనిపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించిన ఓ పోలీసుపై వేటు పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా సదరు పోలీసులపై తీవ్ర ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి, దీంతో అతనిపై ఎట్టకేలకు పోలీసు అధికారుల చర్యలు తీసుకున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో ప్రాంతంలో గల చార్ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా అందుకు పాల్పడింది ఓ రైల్వే పోలీసు.

వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ .. అనునిత్యం ప్రయాణికులతో సందడిగా వుంటంది. రద్దీ దృష్యా స్టేషన్ బయట ఆటోలు, రిక్షాలు నిలపరాదంటూ రైల్వే పోలీసులు అదేశాలు ఇచ్చారు. అయితే అధికారుల అదేశాలు తెలియని రిక్షా కార్మికుడు స్టేషన్‌ ముందుకు వచ్చి.. ప్రయాణికులను రిక్షాలో ఎక్కించుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆ స్టేషన్ లోనే విధులు నిర్వహిస్తున్న విశ్వజిత్‌ సింగ్‌ అడ్డుకున్నాడు. అప్పటికే బూతులు తిడుతూ వచ్చాడు.  

ఇక తీరా రిక్షవాలా వద్దకు చేరుకున్న విశ్వజీత్ సింగ్ ఏరా మా అదేశాలు తెలియవా..? లేక బేఖాతరు చేస్తే ఏంటీ.. అన్న నిర్లక్షమా అంటూ చితకబాదాడు. తన్నుకుంటూ ఈడ్చుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో పడేశాడు. అక్కడే వున్న స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అమర్‌ సింగ్‌ కూడా వృద్ధ రిక్షావాలపై చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్తా వైరల్‌ కావడంతో పాటు తీ్వ్ర విమర్శల పాలైంది. దీంతో విశ్వజిత్‌, ఎస్‌హెచ్‌వో అమర్‌ సింగ్‌ లను ఉన్నతాధికారులు సస్సెండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lucknow  GRP Vishwajit Singh  rickshaw-puller  

Other Articles