Black Money not main reason for demonetisation RBI Clarified

Rbi explanation on demonetisation main purpose

RBI Fake Notes, RBI Black Money, Demonetisation Main Purpose, Black Money Fake Notes, Modi RBI, RBI Demonetisation, Narendra Modi Demonetisation Fake Notes, Fake Notes Demonetisation, RBI Fake Currency

RBI accepted Modi Government’s demonetisation proposal because of fake notes menace, not black money purpose.

ఆర్బీఐ ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి!

Posted: 04/29/2017 09:52 AM IST
Rbi explanation on demonetisation main purpose

ఊహించని విధంగా నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన షాక్ అలాంటిది ఇలాంటి కాదు. అయితే ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఈ అంశంపై నెలల తరబడి సంప్రదింపులు జరిపాకే ముందుకు కదిలినట్లు అప్పట్లో ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. ప్రధాన ఉద్దేశ్యంగా నల్లధనం వెనక్కి తెప్పించే చర్యల్లో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు స్వయంగా మోదీ నోటి నుంచే మాట వెలువడటంతో అంతా హర్షం వ్యక్తం చేశారు.  కానీ, ఇప్పుడు ఆర్బీఐ మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రకటన చేయటం గమనార్హం.

అసలు రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించిన తరువాత, దాన్ని అమలు చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏం చెప్పింది? నోట్ల రద్దు వెనక అసలు కారణాలేంటి? ఈ విషయాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి లిఖితపూర్వకంగా ఇప్పుడు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. నల్లధనం కోసం నోట్ల రద్దును తెరపైకి తేలేదని, దేశంలో చెలామణి అవుతున్న నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం తమకు తెలిపిందని వెల్లడించింది.

ఇండియాలో నకిలీనోట్ల రూ. 400 కోట్ల వరకూ ఉంటాయని అంచనా వేసిన కేంద్రం, వీటి కోసమే పెద్ద నోట్లను రద్దు చేసినట్టు పేర్కొంది. రోజురోజుకూ నకిలీ నోట్ల సమస్య పెరుగుతూ ఉండటం, పొరుగు దేశాల్లోని ప్రభుత్వ ముద్రణాలయాల్లోనే వీటిని ముద్రిస్తుండటం సమస్య కావడంతో, దీన్నుంచి బయట పడేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్టు తెలిపింది. నోట్లను రద్దు చేసిన తరువాత, బ్యాంకులు తమ వద్దకు వచ్చిన నకిలీ నోట్లను పట్టుకోలేదని పేర్కొంది.

ఆర్థిక శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఓ స్పష్టమైన ప్రకటన చేశాడు. 2016 తొలి భాగం నుంచే దీనిపై క్షేత్రస్థాయి ప్రయత్నాలు మొదలుపెట్టిన కేంద్రం, ఆర్థిక శాఖలు అప్పటి గవర్నర్ రఘురామ రాజన్ ను సంప్రదించాకే ముందుకు కదిలిందని వివరించాడు. అంతా సిద్ధంగానే ఉన్నప్పటికీ కొత్త నోట్లకు సంబంధించి పేపర్, ఇంకులు తదితరాలు సమయానికి అందక పోవటం మూలంగానే కొత్త నోట్ల ముద్రణ ఆలస్యం అయినట్లు ఆయన స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  RBI  Fake Notes Menance  

Other Articles