BJP MP threatens to skin cop alive for his 'attitude' గైక్వాడ్ కు తక్కువేం కాదంటున్న బీజేపి మహిళా ఎంపీ

Bjp lawmaker threatens to skin alive cop for alleged misbehaviour

bjp mp warns police office, barabanki mp threats asp, priyanka singh rawat warns ASP, BJP MP, UP police officer, skin alive, murder investigation, Priyanka Singh Rawat, misbehaviour, politics

A BJP MP from Uttar Pradesh has been caught on camera, threatening to “skin alive” a police officer, who had allegedly misbehaved with her regarding a murder investigation.

శివసేన గైక్వాడ్ కు తక్కువేం కాదంటున్న బీజేపి మహిళా ఎంపీ

Posted: 04/28/2017 07:09 PM IST
Bjp lawmaker threatens to skin alive cop for alleged misbehaviour

చట్టపసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇటీవల కొంత వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలుస్తున్న ఘటనలు చూస్తున్న తరుణంలో.. తాను మాత్రం ఎవరికీ ఎం తక్కువ తినలేదని అంటోంది ఈ అధికార బీజేపి ఎంపీ. ఎయిరిండియా విమానం వివాదంలో యావత్ దేశ ప్రజలకు సుపరిచితుడైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. ఆ తరువాత తన నియోజకవర్గంలోని లాతూర్ ఏటీయంలో డబ్బులు పెట్టకపోవడం.. ఏకంగా ఏటీయం కేంద్రాన్ని మూసివేయడంతో అగ్రహించి ధర్నా నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులతో ఆయన వాదనకు దిగిన విషయం చర్చనీయాంశంగా కూడా మారింది.

అయితే సరిగ్గా గైక్వాడ్ మాదిరిగానే ఉత్తర్ ప్రదేశ్ బారబాంకీకి చెందిన బీజేపి ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ కూడా ఓ  పోలీసు అధికారిపై మండిపడ్డారు. అలాఇలా కాదు ఏకంగా అమె అతనిపై ఒంటికాలిపై లేచారు. సాధారణంగా కాకుండా ఏకంగా పోలీసు అధికారికి బీజేపీ ఎంపీ బహిరంగంగా హెచ్చరికలు చేశారు. చర్మం వలిచేస్తానంటూ నేరుగా మీడియా కెమెరా ముందుకొచ్చి తీవ్ర హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా ఆ పోలీసు అధికారి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా చాలా తప్పుడుగా ప్రవర్తించాడని మీడియా ముందు అరోపించారు. అతడి ప్రవర్తన ఏమాత్రం బాగ లేదని మండిపడ్డారు.

పోలీసు అధికారి తన వ్యవహారశైలిని మార్చుకోకపోతే తన అక్రమాస్తుల చిట్టాను బయటపెట్టించి మరీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. బతికుండగానే తన చర్మం వలిచేస్తా అంటూ గ్యానాంజయ్‌ సింగ్‌ అనే పోలీసును మీడియా ముందు నిల్చొని హెచ్చిరించారు. ‘కేంద్రంలో మనకు ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్‌ ఉన్నారని.. వీరి హయాంలో పనిచేసేవారు మాత్రమే జిల్లాలో వుండాలని.. కాదనుకున్నవారు ఏకంగా తమ ఉద్యోగాలను బదిలీ చేయించుకుని వెళ్లాలని అమె అదేశాలు జారీచేశారు.  అధికారుల ప్రవర్తన మారకుంటే మాత్రం కఠినమైన చర్యలు తప్పవని ప్రియాంక రావత్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka singh rawat  barabanki mp  police officer  politics  

Other Articles