Miraculous Escape For 2-Year-Old In China ఈ రెండేళ్ల చిన్నారి మృత్యుంజయురాలే..

Miraculous escape for 2 year old survives after being run over by 2 cars

miraculous escape for toddler, miraculous escape for 2 yrs old, toddler miraculous escape, car runs over toddler, car runs over two years old, miraculous escape, 2-year-old, toddler, cctv footage, car runs over, china, viral video

A 2-year-old had a miraculous escape in China, as the toddler survived even after being run over by two cars one after another.

ITEMVIDEOS: ఈ రెండేళ్ల చిన్నారి మృత్యుంజయురాలే..

Posted: 04/28/2017 03:34 PM IST
Miraculous escape for 2 year old survives after being run over by 2 cars

ఇంట్లో చిన్నపిల్లలు వుంటే అది పెద్ద ఇబ్బంది. ఎవరికంటారా.. ఏదైనా అర్జెంటు పనుండి షాపింగ్ కు వెళ్లాలనుకునే వారికి అది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే వారిని ఇంట్లో ఒంటరిగా వుంచి వెళ్లలేరు.. అలాగని షాపింగ్ కు తీసుకెళ్లినా.. వారు కుదురుగా వుండరు. రెప్పపాటులో గ్యాప్ లో వారే ఏం చేస్తారో..? ఎవరికైనా ఇబ్బందులు తీసుకోస్తారా..? లేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారా..? అన్న భయం వారి కుటుంబ పెద్దల మనస్సులో మాత్రం ఉంటుంది. నమ్మశక్యంగా లేదా..? ఈ వీడియో చూడండీ ఇక్కడ ఆ చిన్నారి చేసిన పనికి ఆ బామ్మకు గుండాగినంత పనైంది.

తన కూతరు ఆఫీసుకు వెళ్తూ తన తల్లికి తన రెండేళ్ల చిన్నారి బాగోగులను చూసుకోమ్మని అప్పగించి వెళ్లింది. అయితే అర్జెంటు పని వుండటం వల్ల తన మనవరాలితో పాటుగా అ బామ్మ షాపింగ్ కు వెళ్లింది. అయితే అక్కడ తాను చేసిన షాపింగ్ వస్తువులను అన్నింటినీ సరి చూసుకుంటే తన ధ్యాసను వస్తువులపైకి పోనిచ్చింది బామ్మ. అదే అదునుగా చేసుకుని ఏకంగా రద్దీగా వుండే రోడ్డుపైకి వచ్చి రెండేళ్ల చిన్నారి.. పరిగెడుతూ రోడ్డును దాటే ప్రయత్నం చేసింది. అ ప్రయత్నంలో ఒక మార్గంలో వెళ్తున్న కార్లను దాటింది చిన్నారి.

ఇక మరో మార్గంలో అటుగా వెళ్తున్న కార్లను ఎలా దాటాలో తెలియని చిన్నారి.. అలాగే పరుగు దీసింది. అప్పటికే ఓ కారు కదులుతుండటంతో అది తాకి కిందపడింది.  ఏ మాత్రం గ్యాప్ లేకుండా ముందు కారును వెనుకగా అనుసరించిన మరో కారు కూడా చిన్నారిపై నుంచి వెళ్లింది. ఆ తరువాత చూస్తే కారు కింద పడిన చిన్నారి భయంతో అలాగే వుండిపోయి కనిపించడంతో ఆ బామ్మ పరుగులు తీస్తూ వచ్చి చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్లింది, ఈ ఘటనలో చిన్నారి తలకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్ జిల్లాలోని జిచాంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృత్యుంజయురాలిగా నిలిచిన ఈ చిన్నారి వీడియోను అప్పడే లక్షల మంది వీక్షించడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2-year-old  toddler  cctv footage  car runs over  china  viral video  

Other Articles