British cancer sufferer kicked off BA flight ప్రయాణికుడి కాళ్లు కట్టేసిన బ్రిటీష్ ఎయిర్ వేస్

Cancer patient restrained and kicked off british airways flight

cancer patient british airways, diabities patient british airways, assult to passenger british airways, passenger assulted british airways, united airlines, american airlines, Kwame Bantu, patient, british airlines, new yorkshire business women joy stoney, Portuguese military base, island of Terceira

A 65-year-old cancer and diabetes patient aboard a British Airways flight is stranded on an island in the Atlantic after allegedly being restrained for entering business class to stretch his legs.

క్యాన్సెర్, షుగర్ పేషంట్ పట్ల అనుచితం.. మరో ఎయిర్ లైన్స్ దాష్టికం

Posted: 04/28/2017 01:46 PM IST
Cancer patient restrained and kicked off british airways flight

విమానయాన సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మొన్న యూనైటెడ్ ఎయిర్ లైన్స్, ఆ తరువాత అమెరికన్ ఎయిర్ లైన్స్. తాజాగా అదే బాటలో బ్రీటీష్ ఎయిర్ వేస్.. తమ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. విమానయాన సంస్థలు కేవలం ప్రయాణికుల పైనే అధారపడి లాభాలను అర్జిస్తున్నాయని, వాటీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీవనోపాధికి కూడా అదొక్కటే మార్గమని అర్థం చేసుకోకుండా వారిపట్ట అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉద్యోగం రాగానే తామేదో ప్రపంచానికే అధిపతులమైనట్టు భావిస్తున్న సంస్థ సిబ్బంది.. తమ ప్రయాణికులనే ఇబ్బందులకు గురిచేస్తూ అనుచితంగా వ్యవహరిస్తున్నారు.

సామర్థ్యానికి మించి ఉన్నారంటూ ఓ వైద్యుడిని కిందకు ఈడ్చిపడేసే క్రమంలో అతనికి రక్తపు గాయాలైనా పట్టించుకోని యూనైటెడ్ ఎయిర్ వేస్ ఘటన వెలుగుచూడగానే అమెరీకన్ ఎయిర్ వేస్ ఇద్దరు పిల్లల తల్లి పట్టల అనుచితంగా వ్యవహరించి.. మరో వికలాంగుడిని అసభ్యపదజాలంతో ధూషించిన రండీ పోట్లాడదాం అన్న రీతిలో రెచ్చిపోయిన సిబ్బంది దురుసు ప్రవర్తనను మర్చపోకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా కేన్సర్, మధుమేహ బాధితుడిని తీవ్రంగా అవమానించింది బ్రిటిష్ ఎయిర్‌వేస్.

వివరాల్లోకి వెళ్తే.. జమైకాకు చెందిన క్వామే బంటు అనే అరవైఐదేళ్ల క్యాన్సర్, మధుమేహ.. పేషంట్ బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో బ్రిటన్‌లోని గాట్విక్ నుంచి జమైకా రాజధాని కింగ్స్‌టన్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. షుగర్ వ్యాధి వుండటం మూలంగా అలా కూర్చుని వుండటం వల్ల అతని కాళ్లు వాచిపయాయి, కాళ్లు చాపుకునేందుకు కొంత వీలుగా వుంటుందని ఫస్ట్‌క్లాస్ క్యాబిన్‌లోకి వెళ్లిన అతన్ని విమాన సిబ్బంది లాక్కొచ్చి ఆయన సీట్లో పడేశారు.

అంతేకాదు, కాళ్లు, చేతులు కట్టిపడేశారు. అతని భుజాల చూట్టూ కూడా కదలకుండా పట్టీని వేశారు. అతడ్ని కదలలేని స్థితిలోకి తీసుకోచ్చారు. షుగర్ వ్యాధి గ్రస్తులు తరచూ టాయ్ లెట్ కు వెళ్తారన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. అఖరికి తాను వాష్ రూమ్ కు వెళ్లాలని బాధిత ప్రయాణికుడు ప్రాధేయపడినా.. అతడ్ని వదలలేదు.. సరికాదా.. అదేదో అతను తన సీటులోనే కానీచ్చేయాలని మొండిగా ప్రవర్తించారు. విమాన సిబ్బంది దారుణాలను చూసిన తోటి ప్రయాణికురాలు బ్రిటెన్ న్యూయార్క్ షైర్ వ్యాపారవేత్త జాయ్ స్టోనీని కూడా విమాన సిబ్బంది అవమానించారు. ముసలాడికి వంతపాడుతుందని వారిద్దరనీ టెర్ సియార ద్వీపంలోని అర్మీ బేస్ విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయారు. తాము అసలు మళ్లీ తమ గమ్యస్తానాలకు చేరుతామని భావించలేదని బాధితులు తెలిపారు.

కాగా విమానాన్ని లండన్ కు బదులు టెర్ సియారా ద్వీపానికి ఎందుకు తరలించి తమను దింపేశారన్న విషయం ఇప్పటికీ తమకు అర్థం కాలేదని జాయ్ స్టోనీ అన్నారు. తమ లగేజీ కూడా ఇవ్వకుండా బలవంతంగా దించేశారని అమె అరోపించారు. క్వామే తన సీటులోకి వెళ్లేందుకు నిరాకరించాడని, అతడు దుర్బాషలాడడం వల్లే మధ్యలోనే దింపేయాల్సి వచ్చిందని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ వివరణ ఇచ్చింది. మహిళ క్వామేకు తోడుగా ప్రయాణిస్తున్నట్టు చెప్పడం వల్లే ఆమెను కూడా దించేశామని పేర్కొంది. అయితే ఈ సున్నితమైన అంశంపై తాము విచారణ చేపట్టామని, తమ సిబ్బంది తప్పుచేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles