Ravula Chandra Sekar Reddy Fires on Minister Harish Rao.

Ttdp leaders target trs key leaders

Telangana TDP, Ravula Chandra Sekar Reddy, Ravula Chandra Sekar Reddy Harish Rao, Harish Rao TDP, Ravula Fire Harish rao, Harish Rao TTDP, Harish Rao Dead Sanke, TTDP Dead Snake, Harsih Rao Critize TTDP, Harish Rao Telugu Desam Party

Telangana TDP senior leader Ravula Chandra Sekar Reddy fires on Minister Harish rao. Harish repeatedly criticize TDP recently said TDP a Dead Snake.

చంద్రబాబు చెప్పాడని చెలరేగిపోతున్నారుగా...

Posted: 04/26/2017 05:35 PM IST
Ttdp leaders target trs key leaders

తెలంగాణలో పార్టీ పై మళ్లీ దృష్టిసారించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికల సంకేతాలతో హడావుడిగా జరిగిన ఈ భేటీలో అధికార పక్షాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడాలంటూ పిలుపునిచ్చాడు. అదే సమయంలో బీజేపీతో పొత్తు, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇలా భేటీ అయ్యిందో లేదో అధినేత ఆజ్నలను శిరసావహిస్తూ టీ తమ్ముళ్లు గులాబీ గూటిపై మాటల దాడికి దిగిపోయారు.

టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రావు కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డాడు. కొద్దికాలంగా తమను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హరీశ్ ఓ చచ్చిన పాము అంటూ ఘాటు కౌంటరే ఇచ్చాడు. అధికార పక్షంలో సీఎం కొడుకు కేటీఆర్ - కూతురు కవిత హవా పెరిగిపోయిందని, హరీశ్ ను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పాడు. ఇంటి పోరుతో పాటు ఎన్నో సమస్యలతో బాధపడుతున్న సిద్ధిపేట్ ఎమ్మెల్యేకు, టీడీపీని విమర్శించే అర్హత లేకపోయినా ఊరట చెందేందుకే ఇలా చేస్తున్నాడని ఎద్దేశా చేశాడు.

ravula fire on harish Rao

ఇక మిత్రపక్షమైన బీజేపీతో తెలంగాణలో కలిసి సాగడంపై వెలువడుతున్న అనుమానాలకు రావుల క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో ఇప్పటికైతే కలిసున్నామని పేర్కొంటూ వచ్చే ఎన్నికల పొత్తుల విషయం ఇప్పుడే చెప్పలేమని అది ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమని రావుల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మే 10 నుంచి 20 వరకు తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని రావుల తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని దీనికి సంబంధించి తీర్మానాలు చేస్తామని వైజాగ్ మహానాడులో చేస్తామని వెల్లడించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP  Ravula Chandra Sekar Reddy  Harish Rao  

Other Articles