mla jeevan reddy slams trs coolie days మిర్చీని అమ్మి లాభాలను అర్జించగలరా..

Mla jeevan reddy challenges trs to sell mirchi

congress mla jeevan reddy, jeevan reddy slams Trs, jeevan reddy slams trs coolie days, jeevan reddy challenges trs leaders, jeevan reddy suggests trs to sell mirchi, jeevan reddy challenges Trs to sell chilli, jeevan reddy, congress mla, TRS, KTR, Kavitha, Mirchi, challenge, politics

congress senior leader and mla jeevan reddy slams Trs leaders for earning lakhs of ruppees in an hour in coolie days, challenges to sell mirchi and take the profit

మిర్చీని అమ్మి లాభాలను అర్జించండీ.. టీఆర్ఎస్ నేతలకు సవాల్..

Posted: 04/26/2017 08:08 AM IST
Mla jeevan reddy challenges trs to sell mirchi

మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులకు మార్కెటింగ్ నైపుణ్యం చాలా వుందని, అందుకనే వారు కేవలం గంటల వ్యవధిలో లక్షల రూపాయల కూలీ డబ్బులను సంపాదించగలుగుతున్నారని అయన వ్యంగంగా వ్యాఖ్యానించారు. ఏసీ గదుల్లో ఐస్ క్రీమ్ లు అమ్మినట్లే.. రైతులు కష్టపడి పండించిన మిర్చి పంటను అమ్మించాలని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన.. మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితలపై సెటైర్లు విసిరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ ఐస్ క్రీమ్ లు అమ్మి, కూతురు కవిత చీరలు అమ్మి నిమిషాలలో లక్షలు సంపాదించినట్లే.. గిట్టుబాటు ధర లేక అల్లలాడుతున్న రాష్ట్ర రైతంగాన్ని అదుకునేందుకు మిర్చీని అమ్మాలని డిమాండ్ చేశారు. మిర్చీ పంటను అమ్మి రైతన్నలకు సాయంగా నిలవాలని, వారికి న్యాయమైన దర ఇచ్చి లాభాంగా వచ్చే ఎక్కువ డబ్బును టీఆర్‌ఎస్‌ సభలకు, ఇత్యాధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చునని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంటలకి బోనస్ ఇచ్చామని, 1800 వున్న పత్తి విత్తనాల ధరను 800కి తగ్గించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిదేనని జీవన్‌ రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ ప్రచారానికి, ఆర్భాటాలకు తప్ప చెప్పినవి అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పక్కరాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులు పండించిన పంటకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల దృష్టి మళ్లించడానికే వచ్చే సంవత్సరం నుండి ఉచిత ఎరువులు అని సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jeevan reddy  congress mla  TRS  KTR  Kavitha  Mirchi  challenge  politics  

Other Articles