Murder at Jayalalithaa's Kodanad Estate | అమ్మ వాచ్ మెన్ దారుణ హత్య.. ఎందుకు చంపారు? ఎవరి పని?.

Murder at jayalalithaa kodanad tea estate

Jayalalithaa Estate, Jayalalithaa' Estate Murder, Robbery Jayalalithaa Estate, Tamil Nadu Jayalalithaa, Jayalalithaa Watchman Murder, Jayalalithaa Kodanad Estate, Nilagiri Hills Jayalalithaa, Jayalalithaa Ooty Estate, Jayalalithaa Assets, Jayalalithaa Properties Paper Fire

Security guard at Jayalalithaa's Kodanad estate hacked to death. Seriously injures another man. Tamil Nadu cops suspect as robbery. But, important documents burnt.

అమ్మ ఎస్టేట్ లో హత్య.. భారీ దోపిడి?

Posted: 04/24/2017 09:36 AM IST
Murder at jayalalithaa kodanad tea estate

తమిళనాడులో మరో కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఊటీలోని టీ ఎస్టేట్ లో హత్య జరిగింది. శివారులో ఉన్న 'కొడనాడ్' ఎస్టేట్ వాచ్ మెన్ ను హత్య చేయటంతోపాటు కీలక పత్రాలను కాల్చివేసినట్లు సమాచారం అందుతోంది.

సుమారు 10 మంది అగంతకులు ఎస్టేట్ లోకి ప్రవేశించి వాచ్ మెన్ ఓమ్ బహదూర్(51) తోపాటు అతనికి తోడుగా ఉన్న కృష్ణ బహదూర్ పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఓమ్ అక్కడిక్కడే చనిపోగా, కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సుదీర్ఘకాలం నుంచి ఓమ్ ఈ ఎస్టేట్ వాచ్ మెన్ గా మొత్తం బాధ్యతలు చూసుకుంటున్నాడంట. అమ్మతోపాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే తరచూ ఇక్కడికే వచ్చేవారని జయ మరణ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఓమ్ వివరాలను వెల్లడించాడు.

ఆపై ఆమె ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, డాక్యుమెంట్లను దుండగులు దహనం చేశారు. దుండగుల దుశ్చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. నీలగిరి హిల్స్ లో సుమారు 90 ఎకరాల్లో విస్తరించి ఉన్న  వెయ్యి కోట్ల విలువైన ఈ ఎస్టేట్ కు సంబంధించిన వ్యవహారాలను కేవలం జయ మాత్రమే చూసుకునేదని దగ్గరి బంధువులు చెబుతున్నారు. జయ చనిపోయాక ఆమె ఆస్తులపై చాలా మంది కన్నేశారు.

కొన్ని ఆస్తులు ప్రస్తుతం శశికళ వర్గీయుల చేతుల్లో ఉండగా, మరికొన్నింటి విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. వాటిలో హైదరాబాద్ లోని ఎస్టేట్ కూడా ఉంది. ఇక తాజా ఘటన వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతుండగా, ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Kodanad Estate  Watchman Murder  

Other Articles