BJP may sweep delhi local bodies elections | కమల వికాసం..అంటే మళ్లీ ఈవీఎంల గోల్ మాల్??

Bjp poised to sweep delhi municipal election

Municipal Corporation of Delhi, MCD Exit Polls, Exit Polls BJP Win, BJP Delhi municipal election, BJP AAP Delhi municipal election, Kejriwal BJP Municipal Election, BJP Sweep, Congress Delhi Local Body Elections

Municipal Corporation of Delhi 2017 exit poll results. The Bharatiya Janata Party is poised to sweep the MCD polls, an exit poll conducted by India Today-Axis My India has predicted. The survey shows the Aam Aadmi Party and the Congress trailing by a huge margin.

ఎగ్జిట్ పోల్ జోస్యం: మళ్లీ బీజేపీదే గెలుపు

Posted: 04/24/2017 08:04 AM IST
Bjp poised to sweep delhi municipal election

వరుస రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో విజయం పడేలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ ను ఘోరంగా దెబ్బ కొట్టి మరీ బీజేపీ ఘన విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.

మూడు కార్పొరేషన్లలో మొత్తం 272 సీట్లు ఉండగా, 218 స్థానాలను బీజేపీ, ఆప్ 24, కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను దక్కించుకుంటాయని ఏబీపీ సర్వే పేర్కొంది. ఇక మిగతా ఛానెళ్ల సర్వేలు కూడా దాదాపు ఇదే ఫిగర్ తో బీజేపీ గ్రాండ్ విక్టరీని ధృవీకరించాయి. గత రెండేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నగర సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి దారుణ ఓటమికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని సరిగ్గా వాడుకుని ప్రజల్లో కమలం సానుభూతి కొట్టేసిందని వారంటున్నారు.

ఇక ఆప్ దారుణ ఓటమికి నేతల వ్యక్తిగత వ్యవహారాలు కూడా మరో కారణంగా చెబుతున్నారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, కుంభకోణాలు, సెక్స్ స్కాండల్ వెరసి సామాన్యుడి పార్టీగా ఆవిర్భవించబడిన ఆప్ ను తీవ్రంగా దెబ్బతీసే అంశాలుగా చెబుతున్నారు. మరోపక్క ఆప్ మాత్రం తమదే విజయం అన్న ధీమాతో ఉంది. ఒకవేళ బీజేపీ భారీ గెలుపు సాధిస్తే మాత్రం ఈవీఎంల ట్యాపరింగ్ అంశంపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇక, కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ పార్టీ కీలక నేతలు అరవిందర్ సింగ్ లవ్లీ, బర్ఖా శుక్లా సింగ్ బీజేపీలో చేరటంతో ఆ పార్టీ దారుణ ఓటమికి సంకేతాలుగానే చెప్పొచ్చు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Delhi Municipal Election  Exit Polls  

Other Articles