pawan kalyan tweets his jana sena too ready for early elections ముందస్తు ఎన్నికలు వచ్చినా జనసేన సిద్దం: పవన్ కల్యాన్

Pawan kalyan tweets his jana sena too ready for early elections

jana sena ready for early elections, pawan kalyan ready for early elections, chandrababu naidu hints for early elections, early elections for andhra pradesh assembly, jana sena, pawan kalyan, chandrababu naidu, ys jagan, ysrcp, tdp, congress, bjp, cpi, left parties, political news, latest news

Actor turned politician power star pawan kalyan tweets that his janasena party is also ready for the elections as and when they come, hinting towards ap cm chandrababu naidu's elections comments

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి జనసేన రెఢీ: పవన్ కల్యాన్

Posted: 04/22/2017 11:44 AM IST
Pawan kalyan tweets his jana sena too ready for early elections

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు వెలువరించిన తరుణంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వాటిని ఎదుర్కునేందుకు, బరిలో నిలిచేందుకు తమ జనసేన పార్టీ సిద్దంగా వుందని సినీనటడు, జనసేన సార్టీ అధినేత పవర్ ప్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికల సంకేతాలపై స్పందించిన వపన్.. సామాజిక మాద్యమం ట్విట్టర్ అనుసంధానంగా తన అకౌంటు ద్వారా తన పార్టీ అభిమానుల్లో జోష్ నింపారు పవన్. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. తమ పార్టీ బరిలో నిలిచేందుకు సిద్దంగా వుందని ప్రకటించారు. ఎన్నికల యుద్దం ఒకవేళ ముందస్తుగా వస్తే జనసేన సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంటుకు, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు జరపాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే జరిగితే షెడ్యూల్‌కంటే ఆరు నెలలు ముందుగా... 2018 నవంబర్‌ నాటికే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు సాధ్యమా కాదా అని చెప్పలేం. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. అవి వచ్చినా, రాకపోయినా మనం మాత్రం సిద్ధంగా ఉండాలి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న పవన్.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ సేన సిద్దంగానే వుంటుందని చెప్పారు.

కాగా పవన్ ప్రస్తుతం అనంతపురం రిక్రూట్‌మెంట్ వ్యవహారంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ వుండగానే చంద్రబాబు ఇచ్చిన ముందస్తు సంకేతాలను అయన దృష్టికి పార్టీ నేతలు తీసుకురాగా, తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి అందోళనకు, ఒత్తిడికి గురికాకుండా పవన్ ఈ మేరకు ట్విట్ చేశారని జనసేన వర్గాలు తెలిపాయి. గత ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించినా.. రాజకీయంగా మాత్రం బరిలో నిలవకుండా కేవలం ప్రశ్నించడానికే ఐదేళ్ల పాటు సమయాన్ని వెచ్చించిన పవన్.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానిక ప్రత్యేక హోదా.. ఇక్కడి యువతకు ఉపాది, ఉద్యోగ అవకాశాలు. వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ ఇత్యాది ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యాయని నేరుగా రాజకీయ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో రిక్రూట్‌మెంట్ ప్రారంభించిన పవన్.. శ్రీకాకుళం, ప్రకాశం, మహబూబ్‌‌నగర్ జిల్లాల్లో నేతల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి ఆ తర్వాత ఆర్నెళ్లు పార్టీ రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు జనసేనాని వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలిసింది. సంస్థాపరంగా పార్టీ నిర్మాణం పూర్తైన తరువాత ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యలను పార్టీ గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని జనసేన భావిస్తోంది. మొత్తానికి జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jana sena  pawan kalyan  ys jagan  chandrababu naidu  andhra pradesh  politics  

Other Articles