Rickshaw wala murdered for the sake of papad in hyderabad అప్పడం అతని అయష్సును ముగించేసింది..!

Rickshaw wala murdered for the sake of papad in hyderabad

Rickshaw wala mudered for papad, rsyed omed ali murdered for papad, friends killed rickshawala for papad, syed obed ali killed by friends for papad, amannagar murder, talabkatta murder, mohammad miskin, shiva kumar, sanjay, papad, toddy, talabkatta, saroornagar, hyderabad news, india news, crime news

In a bizzare incident, Rickshaw wala syed omed ali was murdered for the sake of papad by his friends in amannagar of talabkatta hyderabad

అప్పడం కోసం ప్నేహితుడి ప్రాణం తీశారు..!

Posted: 04/22/2017 10:42 AM IST
Rickshaw wala murdered for the sake of papad in hyderabad

మావవ సంబంధాలన్నీ మనీ చుట్టూ తిరిగే బంధాలే అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ బంధాలలో కేవలం రక్త సంబంధాలు మాత్రమే కాదు.. ప్రాణం కన్నా మిన్నగా కలిసి తిరిగే మిత్రులైనా చివరికి కరెన్సీ వరకు వచ్చేసరికి తమ అరోగన్సీని విడిచి వుండలేక, నానా దుర్భాషలాడటం.. తమ అటిట్యూడ్ ను ప్రదర్శించడంతో.. చూస్తుంటాం. మనిషి మన అన్నవాడు తోడుగా వుంటేచాలు అని తెలుసుకునే సరికి జీవితం చరమాంఖానికి చేరుకుంటాం. ఇప్పుడీ విషయం గురించి ఎందుకంటారా..?

హైదరాబాదులోని ముగ్గురు స్నేహితులు ఒకరికోసం ఒకరు అన్నట్లుగా వుండేవాళ్లు.. ఎవరి వద్ద డబ్బులు లేకపోయినా ముగ్గురూ కలసి మద్యాన్ని సేవించేవాళ్లు. అలాంటి స్నేహం మద్య కేవలం ఒక్క అప్పడం చిచ్చుపెట్టింది. ఈ విషయంలో నోరుజారిన మిత్రుడిపై కక్ష్ పెంచుకున్న అతని ఇద్దరు స్నేహితులు నేరుగా శ్మాశనవాటికకు తీసుకువెళ్లి అక్కడే బండరాయితో మోడీ అతని ప్రాణం తీశారు. సైదాబాద్‌లో ఈ నెల 16న జరిగిన ఈ ఘటన చోటుచేసుకోగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతని ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం అప్పడం అని తెలిసి పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేశారు.

మద్యం తాగితే బుద్ది మందగిస్తుందని అంటారు. ఇందులో కొంతమాత్రమైన నిజం లేకపోలేదని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. భవానీనగర్ తలాబ్‌కట్ట అమన్‌నగర్‌కు చెందిన రిక్షా కార్మికుడు సయ్యద్ ఒమెద్ అలీ (45), అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ మిస్కీన్ (42), మాదన్నపేటకు చెందిన పంజాబీ శివకుమార్ అలియాస్ సంజయ్ (23) స్నేహితులు. ఈ నెల 16న ముగ్గురు కలిసి సరూర్‌నగర్ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగుతుండగా అప్పడం కోసం ముగ్గురి మధ్య గొడవ జరిగింది.

స్నేహితులను అలీ దుర్భాషలాడాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న స్నేహితులు అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఎర్రగుంట శ్మశానవాటిక ఆవరణలో స్క్రాప్ ఉందని, దానిని తీసుకెళ్లి అమ్ముకుందామని చెప్పి అలీని తీసుకుని ఆటోలో శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆటోను రోడ్డుపైనే ఆపి అలీని శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి దాడి చేశారు. బండరాయితో తలపై మోదారు. దీంతో అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసును ఛేదించిన పోలీసులు శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rickshaw wala  syed obed ali  mohammad miskin  shiva kumar  sanjay  papad  toddy  talabkatta  saroornagar  crime  

Other Articles