జన సేన ఎంట్రన్స్ టెస్ట్ లో ఏం ప్రశ్నలు అడుగుతారు? | Entrance Test For Pawan Kalyan Janasena

Janasena qualifying exam details announced

Pawan kalyan, Pawan Kalyan Janasena, Janasena Entrance Test, Janasena Qualifying Exam, Pawan Janasena Exam, Pawan Janasena Party Expansion, Anantapur Janasena Exam

Pawan Kalyan eyes Jana Sena expansion. Qualifying exam will conduct on APril 21st in Anantapur district.

జనసేన లోకి ఎవరిని పడితే వారిని తీసుకోం!

Posted: 04/19/2017 10:40 AM IST
Janasena qualifying exam details announced

జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విస్తరణను, నియామకాలను విద్యార్థుల పరీక్షలు ముగిసిన తర్వాత చేపడతానని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించబోతుంది. మొదటి దశలో అనంతపురంను ఎంచుకున్న ఆ పార్టీ ఈ నెల 21న నియామకం చేపట్టనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

పవన్ సంతకంతో ఉన్న ఓ నోట్ లో ఇలా ఉంది. ‘‘రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువకులు - మేధావులను భాగస్వామ్యుల్ని చేసే ఒక అభ్యుదయ ప్రయత్నానికి ఈనెల 21న అనంతపురంలో జనసేన శ్రీకారం చుడుతోంది. రాజకీయాల్లో అనువంశిక - ఆత్రిత పక్షపాత అవలక్షణాలను తుంచివేసి కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించడానికి తలపెట్టిన ఈ క్రతువును అత్యంత పవిత్రంగా శ్రద్ధతో జరపాలని జనసేన కృతనిశ్చయంతో ఉంది. 3600 ధరఖాస్తులు రావడంతో మూడు రోజులపాటు అర్హత పరీక్ష జరపాలని నిర్ణయించాము’’ అని ఉంది.

జనసేనకు చెడ్డ పేరు తేవాలని తలచేవారు ఈ పవిత్ర యజ్ఞంలో చొరబడకుండా జనసైనికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎంపికలు అత్యంత పారదర్శకంగా ప్రతిభకు పట్టం కట్టేవిధంగా జరుగుతాయి అని పవన్ అందులో వివరించాడు. చిరునామా: జి.ఆర్.గార్డెన్స్ గొంగడి రామప్ప కాంపౌండ్ 3వ రోడ్ ఎక్స్ టెన్షన్ ఈస్ట్ గేటు అనంతపుర 515004. ఎంపిక సమయం మిగిలిన వివరాలను దరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారని తెలిపింది. janaSenaparty.org/antpresourcepersons.pdf లేదా జనసేన ఫేస్ బుక్ ద్వారా కూడ వివరాలు తెలుసుకోవచ్చు.

మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా, తనతో కలిసి వచ్చే వారిని, నిజాయితీ పరులనే ఎంపిక చేసుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena Party  Pawan Kalyan  Qualifying Test  Anantapur  

Other Articles