నాయకత్వానిదే పర్సనల్ ఎజెండా.. నిజం చెబితే నిష్టూరమా..? tdp leadership is implimenting personal agenda

Tdp leadership is implimenting personal agenda no i says mp shiva prasad

TDP MP Shiva prasad, chitoor MP Shiva prasad, TDP leadership own agenda, chandrababu personal agenda, MP slams own party, MP slams his government, shiva prasad slams tdp leadership, siva prasad slams chandra babu, ambedkar birth anniversary

Telugu desam party chitoor MP shiva prasad criticises own party leadership on personal agenda.. questions on decieving SC and STs election promises and asks to verify what people feel about.

నాయకత్వానిదే పర్సనల్ ఎజెండా.. నిజం చెబితే నిష్టూరమా..?

Posted: 04/15/2017 03:03 PM IST
Tdp leadership is implimenting personal agenda no i says mp shiva prasad

టీడీపీ చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత శివప్రసాద్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిత్తూరులో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పులు మాట్లాడలేదని, నిజాలు మాత్రమే చెబుతున్నానని, తన వర్గం ప్రజల తరపున ప్రతినిధిగా వారు ఏమనుకుంటున్నారో.. అదే చెప్పానని అన్నారు. ఎస్సీ ఎస్టీల డీకేటి భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం నిజం కాదా..? వారికి పరిహాలు చెల్లించడం లేదన్న మాట నిజం కాదా..? అని అయన అధినేత చంద్రబాబునే నిలదీశారని సమాచారం.

ఇటీవల జ‌రిపిన‌ మంత్రివర్గ విస్తరణలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి వుండగా, కేవలం ఇద్దరికే మాత్రమే ప్రాతినిథ్యం లభించిన మాట నిజం కాదా.. అని అయన చెప్పరని తెలుస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు వెనక్కు వెళ్లిన మాట వాస్తవం కాదా..? అని అయన అడిగారు. వీటన్నింటిపై తనను తమ వర్గం ప్రజలు నిలదీయడం కారణంగానే తాను సభావేదిక నుంచి అధిసష్టానానికి విన్నవించుకున్నానని చెప్పారని సమాచారం.

ఇక అంతటితో అగని శివప్రపాద్ పై తీవ్రస్థాయిలో అగ్రహాం వ్యక్తం చేసిన చంద్రబాబు.. పార్టీలో కొనసాగాలంటే పర్సనల్ ఏజెండాలు పనిచేయవని.. పార్టీకి కట్టుబడి, అధినాయకత్వం ఎలా నిర్ధేశిస్తే అలా వాటికి అనుగూణంగా నడుచుకోవాలని అదేశించారని సమాచారం. అయితే, ఈ విషయంలోనూ చంద్రబాబుతో శివప్రసాద్ విభేధించారని సమాచారం. పార్టీ నాయకత్వమే పర్సనల్ అజెండాతో ముందుకు వెళ్తుందని, ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో.. ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా ప్రజాప్రతినిధులమైన తమకే తెలియడం లేదని ఇక పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలా తెలుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. నిజాలు చెబితే నిష్టూరంగానే వుంటుందని శివప్రసాద్ అన్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  chitoor MP  MP Shiva prasad  chandrababum  Tele-conference  SC  ST  ministry  government  

Other Articles