శిశువు మరణంపై అస్పత్రికి త్రిసభ్య కమిటీ క్లీన్ చిట్.. Baby dies as ambulance runs out of fuel, probe on

Gurgaon shocker infant dies as ambulance runs out of fuel probe ordered

infants death, Gurgaon General Hospital, Emergency ward, ambulance department, AIIMS, three-month-old boy dies, no ambulance in hospital, civil hospital, Safdarjung hospital, Gurgaon, New Delhi, medical negligence

In a shocking case of negligence, a toddler died just because the civil hospital ambulance that was supposed to ferry him to a Delhi hospital from Gurgaon ran out of fuel.

ఇంధనం లేక నిలిచిన అంబులెన్స్.. శిశువు మృతి, కమిటీ క్లీన్ చిట్..

Posted: 04/15/2017 11:37 AM IST
Gurgaon shocker infant dies as ambulance runs out of fuel probe ordered

దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటి.. అస్పత్రి వర్గాలకు క్లీన్ చిట్ ఇచ్చింది. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా వాహనంలో ఇంధనం అయిపోయి, ఆగిపోవ‌డంతో  మార్గమధ్యంలోనే మూడేళ్ల‌ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారగా.. దీనిపై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. అయితే విచారణ జరపిన కమిటీ అస్పత్రి వర్గాల తప్పిదమేమీ లేదని తేల్చేసింది.

అంతేకాదు వారికి క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది. ఈ ఘటనలో తొలుత డాక్టర్ నిర్లక్ష్యం వుదని వచ్చిన వార్తల నేపథ్యంలో దానిపై విచారించిన కమిటీ మూడు నెలల చిన్నారి మరణం విషయంలో వైద్యుల తప్పు లేదని తేల్చిచెప్పింది. శిశువు అరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు విషయాన్ని గ్రహించి.. శిశువును ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి తరలించాలని నిర్ణయించారని, దీంతో వైద్యుల తప్పిదం లేదని కమిటీ తేల్చిచెబుతూ డాక్టర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉన్న పసికందును ప్రత్యేక చికిత్స కోసం సివిల్‌ ఆస్పత్రి నుంచి సఫ్దర్‌గంజ్ ఆసుప‌త్రికి లేదా ఎయిమ్స్ కు తరలించాలని వైద్యులు సూచించగా.. తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ టెక్నికల్ కారణంగా స్టార్ట్ కాలేదని, దీంతో మరో అంబులెన్సును రప్పించి ఢిల్లీ ఎయిమ్స్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారితో వెళ్లిన అస్పత్రి సిబ్బంది అతను స్పందించడం లేదని గుర్తించారని, దీంతో చిన్నారిని వెనక్కు తీసుకువచ్చారని కమిటీ స్పష్టం చేసింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వుందన్న వార్తలను కూడా కమిటీ తోసిపుచ్చింది.  గుడ్‌గావ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో రెండు సివిల్‌ ఆస్పత్రులకు 16 అంబులెన్స్‌లు ఉంగా, అవన్నీ చాలా పాతవని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles