జియోకు మైండ్ బ్లాక్ చేస్తూ టెలినార్ కొత్త ఆఫర్..అదుర్స్ Telenor offers unlimited 4G data, voice calls at just Rs 103

Telenor offers unlimited 4g data voice calls at just rs 103

Telenor, Telenor FRC 103 plan, Telenor unlimited data plan, Reliance Jio, Telenor users, Telenor 4G, Airtel, Idea

Telenor has brought a really cool offer for its first time users. Telenor's FRC 103 scheme, gives users unlimited voice and 4G data.

జియోకు మైండ్ బ్లాక్ చే్స్తూ టెలినార్ కొత్త ఆఫర్.. అదుర్స్

Posted: 04/14/2017 04:45 PM IST
Telenor offers unlimited 4g data voice calls at just rs 103

టెలీకమ్యూనికేషన్ రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశంతో ఇన్నాళ్లు కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్వవహరించిన టెలికాం సంస్థలు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితికి జారుకున్నాయి. తమ కస్టమర్లు జియోకు అకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నోనో కొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 309 ఆఫర్ తో మూడు నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2జీబి డేటాను అందించడంతో.. పోటీని ఎదుర్కోంటున్న సంస్థలు మరిన్నీ కొత్త అఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నారు.

అయితే జియోకే మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా సరికొత్త ఆఫర్ ను టెలినార్ ప్రకటించింది. కేవలం రూ. 103 రూపాయలకే అన్ లిమిటెడ్ కాలింగ్, 4 జీ డేటాను అందించనున్నట్టు టెలినార్ తెలిపింది. ఈ స్కీమ్ కింద అన్ లిమిటెడ్ 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్ ను 90 రోజుల వరకు చేసుకోవచ్చు. కొత్త యూజర్లకయితే... రూ.103 స్కీమ్ కింద 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ పడుతుంది. అపరిమిత 4జీ డేటా రోజుకు 2జీబీ వరకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోతే డేటా స్పీడ్ 128 కేబీసీఎస్ కు పడిపోతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles