ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ లో ఉద్యోగాలు.. Post Office Recruitment for Gramin Dak Sevak

Post office recruitment for gramin dak sevak

India Post, Gramin Dak Sevak, GDS recruitment, gramin dak sevak recruitment, GDS recruitment 2017, post office recruitment 2017, postal jobs

India Post has begun Gramin Dak Sevak (GDS) recruitment. The recruitment process is continuing in a phase manner for every State of the country.

ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ లో ఉద్యోగాలు..

Posted: 04/14/2017 04:01 PM IST
Post office recruitment for gramin dak sevak

భారతీయ తపాలా శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా విడతల వారీగా రిక్రూట్ మెంట్ జరుగుతుండగా, ఈ ప్రక్రియ గత నెల 18 నుంచి ప్రారంభమైందని పోస్టల్ అధికారులు తెలిపారు. పదో తరగతి, ఇంటర్తో పాటు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు వాటికి అర్హులని తెలిపారు. దీంతో ఈ శాఖ. ఖాళీగా ఉన్న గ్రామీణ సడక్‌ సేవక్‌, మెయిల్‌ డెలివరీ, మెయిల్‌ క్యారియర్స్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్టు హైదరాబాద్‌ నార్త్‌ సౌత్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ బుర్రి శ్రీనివాస్‌ తెలిపారు.

హైదరాబాద్‌ నార్త్‌, సౌత్‌ డివిజన్లలో 11 ఖాళీలు ఉన్నాయని, ఆయా పోస్టులకు 18 నుంచి 40 ఏళ్లున్న వాళ్లు ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయో పరిమితి సడ లింపు ఉంటుందని తెలిపారు. ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థు లు వంద రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాలన్నా రు. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చెల్లించా ల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక విధానం కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని, పూర్తి వివరాలకు WWW.AP.POST.IN/GDS లేదా indiapost.gov.in ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుకు అర్హతలు
    
 *   18-40 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు అర్హులు..
 *   రాష్ట్ర ప్రభుత్వం / కేంద్ర ప్రభుత్వం ఆమోదం స్టేట్ బోర్డ్ నుండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
 *  తగిన కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.. గుర్తింపు పోందిన సంస్థ నుంచి కనీసం 60 రోజులు ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ సర్టిఫికేట్ వుండాలి
 *   గ్రామీణ డాక్ సేవక్ గా ఎంపికైన తరువాత ఆ శాఖ పోస్టాఫీసు పరిధిలోనే నివాసం వుండాలి.
 *   ఎంపికైన వారికి ఏ ఇతర వ్యాపారం కానీ ఏజెన్సీ కానీ వుండారదు.
 *   రూ. 25 వేల పూచికత్తుతో పాటు రూ. పదివేల ఇతరాత్రలకు ఢిపాజిట్ చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles