బాబు.. సాక్షి చూడొద్దన్నాడు గానీ చదువుతున్నాడుగా... | Chandrababu caught with Sakshi Paper.

What s wrong with chandrababu read sakshi

CM Chandrababu Naidu, Chandrababu Naidu Vizag Tour, Chandrababu Naidu Sakshi News Paper, TDP Sakshi, Chandrababu Naidu Interested Sakshi, Sakshi News Paper, Jagan Sakshi Chandra Babu Naidu, chandrababu Caught with Sakshi, Chandrababu Booked, Chandrababu Read Sakshi, Chandrababu Rivalry News Paper

AP CM Chandrababu Naidu busy in reading Sakshi news paper in Vishakapatnam tour.

ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పేంటి?

Posted: 04/12/2017 08:22 AM IST
What s wrong with chandrababu read sakshi

పార్టీకో పేపర్ తప్పనిసరి అవుతున్న ఈ రోజుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మీడియాల మధ్య జరిగే అక్షరాల వార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. పార్టీ పసుపు రంగు కావటంతో యెల్లో మీడియా అంటూ అవతలి పక్షం దుమ్మెత్తిపోస్తే, పేపర్ కలరే యెల్లో కాబట్టి మీదే అది అంటూ ఇలా కథనాలతో విరుచుకుపడటం చూస్తున్నాం. అయితే సాక్షి పేరు చెబితేనే చాలూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మండిపడుతుండటం తరచూ చూస్తుంటాం. అక్షరసత్యాలంటూ అసత్యాలను ప్రచారం చేస్తోందని కొన్నాళ్లపాటు ఆ మీడియాను సమావేశాలకు కూడా ఆహ్వానించని సందర్భాలు ఉన్నాయి. అంతేనా సహనం కోల్పోయి అసలు దానిని చూడొద్దంటూ చెప్పిన దాఖలాలు అనేకం.

మరి అలాంటి సాక్షినే ఆయనే ఆసక్తిగా చదివితే ఎలా ఉంటుంది. మంగళవారం ఉదయం విశాఖపట్నం అధికారిక పర్యటనలో భాగంగా చంద్రబాబు తన కాన్వాయ్ లోనే చదువుతున్న ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పోర్టు నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంలో ఓ సిగ్నల్ దగ్గరి నుంచి వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ సీన్ దర్శనమివ్వగా పలువురు ఫోటోలు తీశారు. మొదటి పేజీ నుంచి చివరి వరకు ఆసాంతం చూస్తూ తనకు అవసరమైన కథనాలను చంద్రబాబు చదవటం ఇందులో చూడొచ్చు. అయితే ఇందులో పెద్ద రాద్ధాంతం చేయాల్సిన విషయం లేదు.

Chandrababu Sakshi Paper

మాములుగా ఆయన అధికార వాహనంలో అన్ని పత్రికలు(సాక్షితోసహా) అందుబాటులో ఉంచుతారు అధికారులు. మరి ఏదీ దొరకనట్లు సాక్షే ఎందుకు చదివాడు అంటారా? అక్కడికే వస్తున్నాం. తన పాలన ఫీడ్ బ్యాక్ కోసం సాక్షి పత్రికలో వచ్చే వ్యతిరేక కథనాలపైనే ఆమయన ఎక్కువ దృష్టిసారిస్తుంటారని కొందరు టీడీపీ తరచూ చెబుతుంటారు కూడా. తీరిక దొరికినప్పుడల్లా ఆ పత్రికను తప్పనిసరిగా చదువుతు వాటి ఆధారంగానే నేతల పని తీరుపై ఓ కన్నేస్తాడని కూడా మరికొందరు చెబుతున్నారు. అయినా చూడొద్దని సూచించాడే గానీ, తాను చదవనని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు కదా! అలాంటప్పుడు దీనిని లాజిక్కే అనుకోవాలేమో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Sakshi Paper  Vizag Tour  

Other Articles