మూషికాన్ని చూసి బెంబేలెత్తిన పోలీసు.. వీడియో వైరల్ Cop Caught On CCTV Running Away From A Mouse

Terrified cop caught on cctv running away from mouse in police station

police man, police man runs seing mouse, mouse fears policeman, policeman scares of mouse, american police mouse, mouse, police station, saint petersburg, florida, america, cctv footage, viral video

This hilarious footage shows a terrified police officer running away from a mouse in a police station. The video begins with the officer walking along a corridor in the station, believed to be in Saint Petersburg, Florida, USA

ITEMVIDEOS: మూషికాన్ని చూసి బెంబేలెత్తిన పోలీసు.. వీడియో వైరల్

Posted: 04/04/2017 04:55 PM IST
Terrified cop caught on cctv running away from mouse in police station

మూషికం అంటే ఎలుక.. దానిని చూసిన తెలుగింటి అడవాళ్లు.. అది ఇళ్లలోకి రాకుండా ఏ కర్రతోనే లేదా చీపురుతోనో కోట్టి బయటకు గదుముతుంటారు. మరీ వాటి ప్రభావం అధికంగా వుందని భావిస్తే బోను ఏర్పాటు చేస్తారు. లేదా పిల్లిని పెంచుకుంటారు. కానీ అమెరికాలోని ఓ  పోలీసు అధికారి మాత్రం ఏకంగా మూషికాన్ని చూసి భయకంపితుడయ్యారు. దాని నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడ్డాడు. అయితే అదే సమయంలో అతన్ని చూసిన ఎలుక కూడా కంగారుపడింది. ఈ మొత్తం సీన్ సిసీటీవీల్లో రికార్డు కావడంతో .. అది కాస్తా వైరల్ గా మారింది.

అసలే పోలిస్ స్టేషన్ ఎంతటి కరుడుగట్టిన నేరస్థుడైనా అక్కడ పోలీసులకు లొంగాల్సిందే. కానీ అలాంటి చోట ఓ పోలిసు అధికారి ఎలుకను చూసి కంగారు పడి పరుగులు పెట్టడం.. మళ్లీ వెనక్కు వచ్చి అది వెళ్లిందా లేదా..? అంటూ చుట్టూ పరిశీలించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్ లో వున్న సిసిటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమైయ్యాయి. అరుగడులు పోడవు, కాళ్లకు బూట్లు ధరించిన పోలీసు.. చక్కని దేహదారుడ్యంతో.. చూడ‌డానికి గంభీరంగా ఉన్నాడు. కానీ సదరు అధికారి ఎలుకను చూడగానే కంగారెత్తిపోయాడు.

అదే సమయంలో ఎలుకపిల్ల కూడా కంగరెత్తి బాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే వెంటనే లేచి వెళ్లిపోయింది. దానిని కూడా గమనించని పోలిసు అధికారి ఎలుకను చూూసి చూడగానే భయపడి దానిన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.. గోడ సాయంతో ఇటుగా రావడం.. మళ్లీ మూషికం వెల్లిందా లేదా అంటూ వెనక్కి తిరిగి చూడటం అన్ని చకచక జరిగిపోగా, ఈ వీడియోలు ఇప్పడు నెట్ జనులకు నవ్వులపువ్వులు పండిస్తున్నాయి. కరుడుగట్టిన నేరస్థులు కూడా జంకే పోలీసును ఓ చిట్టి ఎలుక భయపెట్టిందంటూ కామెంట్లు పోస్టు చేస్తూ అనందిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police man  mouse  police station  saint petersburg  florida  america  cctv footage  viral video  

Other Articles