వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.. రాఖీ సావంత్ అరెస్టు.. Rakhi Sawant arrested for making derogatory remarks against Valmiki

Rakhi sawant arrested by punjab police for making derogatory remarks against valmiki

Punjab, Punjab police, rakhi sawant, Valmiki, rakhi sawant arrested, Rakhi Sawant police, salman khan, sage valmiki, rakhi sawant salman khan, rakhi sawant derogatory remarks

Controversial TV and Bollywood actress Rakhi Sawant, booked for making derogatory remarks against sage Valmiki, has been arrested by Punjab Police

వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.. రాఖీ సావంత్ అరెస్టు..

Posted: 04/04/2017 04:06 PM IST
Rakhi sawant arrested by punjab police for making derogatory remarks against valmiki

అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద చర్యలతో వార్తల్లో వుండాలని ప్రయత్నం చేస్తే అందుకు తగిన పరిహారం కూడా చెల్లించుకోవాలని.. కాగల కార్యం గంధర్వులు చేసిప్పుడు మాత్రం అందరికీ గుర్తుకు వస్తుంది. నిత్యం వివాదాల నడుమ వుండే టీవీ, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ విషయంలోనూ ఇప్పుడు అదే నిజమైంది. ఇన్నాళ్లు తాను సెలబ్రిటీనంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో కేంద్రబిందువుగా నిలిచన అమెను ఇవాళ పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

రామాణయ గ్రంధ రూపకర్త మహాకవి, మహర్షి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాఖీ సావంత్ పై పంజాబ్ లో ఓ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం అమెను అరెస్టు చేయాల్సిందిగా అరెస్టు వారెంట్లు జారీ చేసింది, దీంతో ఇద్దరు సభ్యులు గల లుధియానా పోలీసులు పంజాబ్ నుంచి నేరుగా ముంబై చేరుకుని అమె నివాసానికి వెళ్లారు. అయితే అమె అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మళ్లి చేరుకున్న పోలీసులు అమెను అరెస్టు చేశారు.

ఓ టెలివిజన్ షోలో పాల్గన్న రాఖీ సావంత్.. వాల్మీకి మహర్షికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు మనోభావాలను గాయపర్చే విధంగా అమె వ్యాఖ్యలు చేశారని, దీనిపై పంజాబ్ కు చెందిన పలువురు యువకులు అమెకు వ్యతిరేకంగా స్తానిక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. అయితే మార్చి 9న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని అమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. వాటిని కూడా తేలిగ్గానే తీసుకున్న సావంత్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అమెపై న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేయగా, పోలీసులు అమెను అరెస్టు చేసి లుధియానాకు తీసుకెళ్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakhi sawant  salman khan  punjab police  arrest  sage valmiki  derogatory remarks  

Other Articles