ఇండియన్ ఐటీ ఉద్యోగుల వీసాలు బ్లాక్ చేస్తున్నారు | Singapore blocks visas for Indian IT professionals.

Not just us singapore steps up to reduce visas for indian it professionals

Singapore Indians Visa, Singapore Blocks Visa, America Singapore Visa Block, Indian IT professionals, Visa Trouble for Indian IT professionals, Visas Cut Down, India Singapore Visa

After US, Singapore cuts down visas to Indians in IT sector. Asks Indian IT companies to hire local talent.

ఒక్క అమెరికానే కాదు.. సింగపూర్ కూడా

Posted: 04/03/2017 01:41 PM IST
Not just us singapore steps up to reduce visas for indian it professionals

స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదంతో వీసా నిబంధనల్లో సమూల మార్పులు తెచ్చి వలసదారులకు పెద్ద షాక్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొండిగా తీసుకున్న ఈ నిర్ణయం మూలానా భారత్ లాంటి వలసలు ఎక్కువగా ఉన్న దేశానికే నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా భారత ఐటీ ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బగా బాధపడుతున్న వేళ ఇప్పుడు సింగపూర్ కూడా అలాంటి నిర్ణయమే ప్రకటించి మరో షాక్ ఇచ్చింది.

అగ్ర రాజ్యం బాటలోనే నడుస్తూ భారత ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇప్పటికే జారీ చేయాల్సిన వీసాల సంఖ్యను కూడా భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించి తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. వీటితోపాటు వర్క్ వీసాలు పొందిన వారి సంఖ్య గణనీయంగా తగ్గించగా, ఇది సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద నియమావళికి విరుద్ధమని వాణిజ్య విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వీసాల సమస్య గత సంవత్సరం నుంచే ప్రారంభమైందని, అన్ని భారత కంపెనీలకూ ప్రభుత్వం నుంచి వీసాల కోత, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై నోటీసులు ఇచ్చాయని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ముఖ్యంగా సర్వీస్ ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. కాగా,  సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజంట్, ఎల్ అండ్ టీ తదితర ఐటీ సంస్థలు ఎంతో మంది భారతీయులను అక్కడికి తీసుకువెళ్లి పనులు జరిపించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్-1బీ వీసాలపై ఆందోళన అక్కర్లేదని గత వారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హమీ ఇచ్చాక కూడా సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఆందోళన రెకెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singapore  Indian IT Employees  Visa Blocks  

Other Articles