రజనీ లేఖలతో వాళ్లు వణికిపోయారు. ఇంతకీ ఆ మాట ఎందుకు అన్నాడు? | Rajinikanth fans to hold brainstorming meet on April 2

Rajinikanth writes letter to sri lankan tamils

Superstar Rajinikanth, Rajinikanth Party, Rajinikanth Fans Meeting, April 2 Rajinikanth, Sri Lankan Tamils Rajinikanth, Rajinikanth Right Time, Rajinikanth Politics, Rajinikanth Fans Meeting

Superstar Rajinikanth would meet his fan club members in Chennai on April 2. But, his publicist denies reports. After cancelling trip, Rajinikanth writes to Sri Lankan Tamils, says 'we will meet when time is right'.

చెన్నైలో రజనీ లేఖల కలకలం

Posted: 03/30/2017 08:15 AM IST
Rajinikanth writes letter to sri lankan tamils

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మళ్లీ చర్చ మొదలైంది. తనకు రాజకీయాలు ఇష్టం లేదు ముర్రో అంటున్నా సరే అభిమానుల నుంచి ఒత్తిడి మాత్రం తీవ్రంగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన సోదరుడు సత్యనారాయణ జయలలిత మరణం అనంతరం రజనీ పొలిటికల్ ఎంట్రీకి సరైన సమయం అని వ్యాఖ్యానించిన తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైంది. దీనికి తోడు మధ్యమధ్యలో చిదంబరం, పలువురు బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరపటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆయన త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు చెన్నైలో సీరియస్ డిస్కషన్ జరుగుతోంది.

తన అభిమానులంతా ఏప్రిల్ 2న చెన్నై రావాలని ఆహ్వానిస్తూ రజనీ పేరిట లేఖలు వెలువడటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ సమావేశం అనంతరం రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ శూన్యత రాజ్యమేలుతున్న నేపథ్యంలో తలైవా ఎంట్రీకి ఇది కరెక్ట్ టైమని వారు కూడా సూచిస్తున్నారు.

రీసెంట్ గా శ్రీలంకలో తమిళులను కలవవద్దంటూ పలు పార్టీలు సూచించిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకుని, బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తానసలు జాలర్ల సమస్యలపై అధ్యక్షుడితో చర్చిద్దామనకుకున్నానని తెలపటం, ఆపై సరైన సమయంలో కలుద్దామని పేర్కొంటూ శ్రీలంక తమిళీయులకు ఓ లేఖ రాయటంతో రాజకీయ ట్రయల్స్ మొదలుపెట్టాడా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ మధ్యే కమల హాసన్ కూడా తన అభిమానులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే రజనీ లేఖలపై ఎక్కడా అధికార ప్రకటన లేఖపోవటం, పైగా పోస్టర్లు కూడా వెలియటంతో అది అభిమానుల పనే అని తర్వాత రజనీ పబ్లిసిస్ట్ రిజాయ్ అహ్మద్ వెల్లడించాడు. ఏదీ ఏమైనా హఠాత్తుగా తీసుకున్నాడని వచ్చిన వార్తపై అభిమానుల్లో ఆనందం, పార్టీల్లో కలవరపాటు మొదలైందనే చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Superstar Rajinikanth  Political Party  Sri Lankan Tamils  Fans Meeting  

Other Articles