‘ఓవరాక్షన్’ ట్వీట్ కు.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్ | KTR responded to Traffic Police attack.

Ktr tweet on friendly policing to dgp

Telangana, KTR Tweet, People-Friendly Policing, KTR Friendly Policing, Uppal Traffic Police Attack, KTR DGP Tweet, KTR Traffic Police Video, KTR Response on Police Attack

Telangana IT Minister KTR responded on a tweet that traffic police attack on Watermelon Seller. Suggest DGP to counselling junior officers for Friendly Policing Policy.

ఓవరాక్షన్ ట్వీట్ కు.. కేటీఆర్ రియాక్షన్

Posted: 03/21/2017 01:11 PM IST
Ktr tweet on friendly policing to dgp

ప్రస్తుతం ట్రెండ్ ను ఫాలో అవుతున్న మన నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఊపిరి సలపని షెడ్యూల్ తో బిజీగా ఉంటున్న నేతలు ఒకానోక దశలో వాటి ఆధారంగానే ప్రజా సమస్యలను పరిష్కారించటం హర్షనీయంగా మారింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ లాంటి నేతలైతే ఏకంగా అందులోని సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. తెలంగాణ విషయానికొస్తే ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆ విషయంలో ముందున్నాడు.

ఆ మధ్య చిన్నారుల బడి బతుకులపై కదిలించే ట్వీట్ వేసిన కేటీఆర్, తాజాగా మరో దానిపై స్పందించాడు. ప్రజలతో మమేకం అవ్వాల్సిన పోలీసులు వారిపట్ల అతిగా ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడటమే కాదు ఏకంగా పోలీస్ బాస్ కు ఫిర్యాదు కూడా చేశాడు. విషయం ఏంటంటే... ఈ మధ్య ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఓ ట్రాఫిక్ పోలీస్ పుచ్చ కాయల వ్యాపారిపై దౌర్జన్యం చేశాడు. రోడ్డు పక్కన అమ్ముకోవటానికి వీల్లేదంటూ వాటిని విసిరికొట్టాడు. అటుగా వెళ్తున్న కొందరు ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీశారు.

 

వెంటనే అవి ట్విట్టర్ లో దర్శనమివ్వగా మరికొందరువ వాటిని కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. సరైన సదుపాయాలు లేని షాపింగ్ మాల్ లలో కూడా వాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ ఓ వ్యక్తి వేసిన ట్వీట్ మంత్రికి చేరింది. అంతే వెంటనే ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లటమే కాదు చర్యలను తీసుకోవాలని కోరాడు. అంతేకాదు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట జనాలకు భరోసా ఇవ్వాల్సిన వారు ఇలా ప్రవర్తించటం సరికాదని, ఈ విషయంలో కింది స్థాయి అధికారులకు కౌన్సిలింగ్ ఇవ్వండంటూ అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

KTR Traffic Police Tweet

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  People-Friendly Policing  KTR Tweets  

Other Articles