నెల్లూరు టీడీపీదే.. కర్నూలు, కడపలో కాస్త టెన్షన్... | MLC Poll Counting Started in Andhra Pradesh.

Tdp vakati narayana reddy wins nellore mlc

AP MLC Elections, MLC Election Results, Vakati Narayana Reddy Win, Nellore MLC TDP, Kurnool MLC Shilpa Chakravarthy, Vakati Narayana Reddy, Kadapa MLC

MLC Poll Counting Started in AP. TDP Candidate Shilpa Chakravarthy Lead in Kurnool District. TDP Candidate Vakati Narayana Reddy Wins in Nellore District. YSRCP MLC Candidate YS Vivekananda Reddy also in lead.

టీడీపీ ఖాతాలోనే నెల్లూరు ఎమ్మెల్సీ

Posted: 03/20/2017 10:04 AM IST
Tdp vakati narayana reddy wins nellore mlc

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు ఎమ్మెల్సీని టీడీపీ కైవసం చేసుకుంది. కౌంటింగ్ ప్రారంభమైన 50 నిమిషాల్లోనే ఫలితాలు వెలువడటం విశేషం. స్థానిక సంస్థల కోటాలో బాగంగా జరిగిన ఓ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై ఆయన 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ముగియగా అధికారులు వాకాటి విజయాన్ని ధ్రువీకరించారు.

 

కాగా, వాస్తవానికి నెల్లూరు పరిధిలో వైకాపా ఓటు బ్యాకింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించడం లాంటి పరిణామాలు టీడీపీకి బాగా కలిసొచ్చాయి. మొత్తం 852 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 851 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిల్లో వాకాటికి 462, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డికి 377 ఓట్లు పోల్ కాగా, మరో 2 ఓట్లు చెల్లలేదు. దీంతో 85 ఓట్ల మెజారిటీతో వాకాటి విజయం సాధించినట్లయ్యింది.

మిగిలింది కడప, కర్నూలు..

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. వైకపా తరపున వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కన్నా ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఫిరాయింపుల అనంతరం తెలుగుదేశానికి బలం ఉన్నప్పటికీ, క్రాస్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందని వైకాపా నమ్ముతూ వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబానికి కంచుకోటలా ఉన్న కడప ప్రాంతంలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగగా, ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు సైతం క్రాస్ ఓటింగ్ జరిగినట్టు సూచిస్తున్నాయి. ఇక కర్నూలు విషయానికి వస్తే, తెలుగుదేశం అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 30 ఓట్ల ఆధిక్యంలో ఉండి, అక్కడ పాగా వేసేందుకు సిద్ధమైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  MLC Elections  Results  Nellore MLC  TDP Vakati Narayana Reddy  

Other Articles