ఆదిత్యనాథ్ ఎంపికపై అసుదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు Adityanath as UP CM part of Modi's 'New India' vision

Adityanath as up cm part of modi s new india vision asaduddin owaisi

uttar pradesh CM, up elections-2017, yogi adityanath, aimim, asaduddin owaisi, BJP, PM Modi, ganga jamuni tehzeeb, politics

Yogi Adityanath's elevation as the CM of UP is part of Narendra Modi's vision of a "new India", AIMIM leader Asaduddin Owaisi said, taking a jibe at the decision.

ఆదిత్యనాథ్ ఎంపికపై అసుదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Posted: 03/19/2017 10:03 AM IST
Adityanath as up cm part of modi s new india vision asaduddin owaisi

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంపికైన బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యానాథ్‌ తన మద్దతుదారులకు హద్దుమీరిన సంబరాలు వద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. సంబరాల పేరుతో గొడవలకు దిగేవారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వేడుకల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని, ఇటువంటి వారిపై పోలీసులు తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆదిత్యనాథ్‌ తెలిపారు.

అయితే యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంపై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసుదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదిత్యనాథ్ ఎంపికతో ప్రధాని నరేంద్రమోదీ 'నూతన భారత' విజన్‌లో భాగమని, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందంటూ ఘాటుగా స్పందించారు. భారత అనాది హిందు, ముస్లిం సంస్కృతుల సమ్మేళనమైన 'గంగాయమున తెహజీబ్‌'పై ఇది దాడి చేయడమేనని తీవ్రంగా మండిపడ్డారు.

అధికారంలో ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ ముస్లింలను మోసం చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపి పరిమితవాద అభివృద్ధి నమూనాను అవిష్కరించనుందన్ని ఎద్దేవా చేశారు. వాళ్లు మాట్లాడుతున్న 'ప్రగతి' ఇదే' అని ఒవైసీ పేర్కొన్నారు. కాగా, మరో ముస్లిం నాయకుడు అయిన ఢిల్లీ జమా మసీదు ఇమాం సయెద్‌ అహ్మద్‌ బుఖారీ ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. తన వివాదాస్పద గతాన్ని వీడనాడి.. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం యోగి ఆదిత్యనాథ్‌ కృషి చేస్తారని తాను భావిస్తున్నట్టు బుఖారీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh CM  yogi adityanath  aimim  asaduddin owaisi  BJP  PM Modi  

Other Articles