ప్యాసింజర్ రైలులో పేలుడు.. ఎనమిది మందికి గాయాలు.. Blast in Bhopal-Ujjain passenger train; 8 injured

Blast in 59320 bhopal ujjain passenger train near shajapur 8 injured

Bhopal-Ujjain passenger train, Explosion in train, bomb, explosion, Indian Railways (IR), Shajapur, injured, Madhya Pradesh

At least six people were injured after an explosion took place in Bhopal-Ujjain passenger train. The incident took place in train no-59320 in Madhya Pradesh's Shajapur.

ITEMVIDEOS: ప్యాసింజర్ రైలులో పేలుడు.. ఎనమిది మందికి గాయాలు..

Posted: 03/07/2017 12:13 PM IST
Blast in 59320 bhopal ujjain passenger train near shajapur 8 injured

భోపాల్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఇవాళ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనమిది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలాపీపల్ సమీపానికి 59320 నెంబరు గల రైలు చేరుకోగానే ఉదయం పది గంటల సమయంలో పేలుడు చోటుచేసుకుంది. పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదమా..? లేక సంఘ విద్రోహశక్తుల చర్యా అన్ని విషయమై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కాసేపు గందరగోళం నెలకొంది. రైలును ఆపివేయడంతో ప్రయాణికులు కిందకు దిగిపోయారు. పేలుడు సమాచారం అందుకోగానే రైల్వే అధికారులు హుటాహుటిన వైద్యబృందాలను ఘటనాస్థలానికి పంపారు. తీవ్ర గాయాలైన వారికి స్థానికి కాళాపిపల్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles