అసీస్ ఎదుట 188 పరుగుల విజయలక్ష్యం.. Hazlewood Takes Six Wickets as Aus Need 188 to Win

Bangalore test hazlewood takes six wickets as aus need 188 to win

india vs australia, virat kohli, ajinkya rahane, india australia bengaluru test, m chinnaswamy stadium, Virat Kohli , Steve Smith, hazelwood, Australia cricket, India Cricket cricket, cricket news, latest sports news, sports, cricket news, cricket

Ishant Sharma falls just before lunch and India get all out for 276 runs. Australia need 188 runs to win the second Test and take a 2-0 lead in the series.

మిడిల్ ఆర్డర్ విఫలం.. అసీస్ ఎదుట 188 పరుగుల విజయలక్ష్యం..

Posted: 03/07/2017 11:53 AM IST
Bangalore test hazlewood takes six wickets as aus need 188 to win

విరాట్ సేన మళ్లీ విఫలయమైంది. అస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో అసీస్ బౌలర్ల ఎదుట మళ్లీ మొకరిల్లారు. మరోమారు ఇలాంటి చెత్త ప్రదర్శన ఇవ్వం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినా.. ఆట తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 213/4.. పటిష్టంగా కనిపించిన టీమిండియా.. నాల్గవ రోజు లంచ్ విరామానికి చాపచుట్టేసింది. నాల్గవ రోజు కేవలం 61 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయి బోక్కబోర్లాపడింది. పలితంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అస్ట్రేలియాకు ఎదుట 188 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.

నాల్గవ రోజు భారత్ కనీసం మరో 100 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసి.. ఆ తరువాత అసీస్ ను కంగారెత్తిస్తారని ఆశించిన భారత క్రికెట్ అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. విరాట్ సేన మాత్రం తమ చెత్త ప్రదర్శనను కొనసాగించి భారత అభిమానుల ఆశల్ని నీరుగార్చారు. వరుస వికెట్లు చేజార్చుకుని మరోసారి ఆసీస్ కు తలవంచారు. చివరి ఆరు వికెట్లను 36 పరుగుల వ్యవధిలో కోల్పోయి కంగారుల బౌలింగ్ కు బెంబేలెత్తిపోయారు. హజల్ వుడ్ మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో రాణించడం విరాట్ సేన నడ్డివిరిచింది.

భారత్ స్కోరు 238 పరుగుల వద్ద రహానే(52) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో క్రీజ్ లోకి వచ్చిన కరుణ నాయర్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో నాయర్ వచ్చే రావడంతోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత  పూజారా(92), అశ్విన్(4)లను మూడు బంతుల వ్యవధిలో హజల్ వుడ్ అవుట్ చేసి భారత్ కు షాకిచ్చాడు. కాగా, హజల్ వుడ్ వేసిన తరువాత ఓవర్ లో ఉమేశ్ యాదవ్(1)అవుట్ కావడంతో భారత్ 258 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ ను కోల్పోయింది. చివర్లో సాహా(20 నాటౌట్)తో కలిసి ఇషాంత్ శర్మ (6) కాసేపు ఆసీస్ బౌలింగ్ ను ప్రతిఘటించారు.  చివరి వికెట్ గా ఇషాంత్ అవుట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగింసింది. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్ ఆరు వికెట్లతో రాణించగా, స్టార్క్ , ఓకీఫ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chetteshwar pujara  ajinkya rahane  hazelwood  india  australia  bangalore  cricket  

Other Articles