అమెరికాలో తెలంగాణ యువతిపై కాల్పులు.. జాత్యాహంకార దాడేనంట! | Racial attack on Telangana woman in US.

Indian woman racially attacked in us

Waranagl Jyothi, US Indian Woman Attack, Indian Racial Attack, Telangana Woman attack US, Racial Attack on Indians, Hate Crime Indian Woman, Woman Gun Shot in America, Indian Woman Attack, Racial Attack, Telangana Jyothi

Hate crime in US. Another Indian Woman gun shot by Black man. Recognised Jyothi from Waranagl. Escaped with hand injuries.

ఈసారి తెలుగు యువతిపై తూటా పేలింది

Posted: 03/06/2017 04:34 PM IST
Indian woman racially attacked in us

అగ్రదేశంలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తక్కువ వ్యవధిలో వరుసదాడులు అక్కడి వారిని భీతిల్లేలా చేస్తోంది. శ్రీనివాస్ కూచిభొట్ల తర్వాత, హర్నీష్ పటేల్, దీప్ రాయ్ లపై జాతి విద్వేష దాడులు వెనువెంటనే జరిగిన విషయం తెలిసిందే. భారత విదేశాంగతోసహా అక్కడి సంఘాలు కూడా వాటిని తీవ్రంగా ఖండించాయి. అయితే అక్కడ అధికారుల నుంచి భద్రత విషయంలో ఎలాంటి స్పష్టమైన హామీ మాత్రం లభించటం లేదన్నది మాత్రం మరింత కంగారు పెడుతోంది.

ఇంతలోనే మరో యువతిపై కాల్పులు జరగటంతో మళ్లీ ఒక్కసారిగా కలకలం రేగింది. తాజాగా, ఓ తెలుగు యువతిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతిగా గుర్తించారు.

అయితే చేతిలోకి మాత్రమే బుల్లెట్లు దూసుకుపోవటంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. 10 రోజుల్లో నాలుగు ఘటనలు.. ఏదో ఒక ప్రాంతంలో ఇలా ప్రతి రోజు భారతీయులపై జాత్యాంహకార దాడులు జరుగుతుండటంతో అక్కడి తెలుగు సంఘాలు జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Racial Attack  Telangana Woman  

Other Articles