ఆమెరికాలో మరో భారత సంతతి వ్యాపారి హత్య.. Another Indian Businessman Shot Dead In US

Indian origin businessman harnish patel shot dead outside his home in us

Indian origin man shot dead, South Carolina, Harnish Patel, Speedee mart, Srinivas Kuchibhotla, Indian origin businessman, US Hate Crime, America

With the nation still in shock from the killing of an Indian engineer in the US last week, another Indian-origin businessman has been shot dead outside his home in South Carolina

ఆమెరికాలో మరో భారత సంతతి వ్యాపారి హత్య..

Posted: 03/04/2017 01:37 PM IST
Indian origin businessman harnish patel shot dead outside his home in us

అమెరికాలోని కన్సాస్ లోని అస్టింగ్స్ బార్ లో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్‌ కూచిబొట్ల దారుణహత్య విషాదఘటనను మర్చిపోకముందే.. అమెరికాలో మరో భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. అమెరికాలో జాత్యాహంకారం పెచ్చిమీరుతుందంటూ భారత్ సహా పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే మరో ఘటన భారతీయులను షాక్ కు గురిచేసింది. దక్షిణ కరోలినాలో హర్నీష్‌ పటేల్‌ అనే భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి బయటే కాల్చిచంపడం కలకలం రేపుతుంది.

అయితే ఇది పటేల్ గురించి బాగా తెలిసిన వ్యక్తుల పనే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన నిమిషాల వ్యవధిలో ప్రాణాలు విడిచారని పోలీసులు భావిస్తున్నారు. కాగా జాతివివక్షతో పటేల్‌ను చంపి ఉండకపోవచ్చని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11:24 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టు అక్కడి మీడియా వెల్లడించింది.

లాంకస్టెర్‌లో పటేల్ కుటుంబం నివాసం వుంటున్న నేపథ్యంలో ఈ వార్తతో అక్కడ విషాధఛాయలు అలుముకున్నాయి. లాంకస్టెర్లో పటేల్ హత్యోదంతంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉంది. అందరితో స్నేహంగా మెలుగుతూ ఇతరులకు సాయపడేవారు. లాంకస్టెర్‌ కౌంటీ షెరిఫ్‌కు దగ్గరలోనే ఆయన స్పీడీ మార్ట్ పేరున స్టోర్ నిర్వహిస్తున్నాడు. పటేల్ గొప్ప వ్యక్తి, స్నేహితుడని కౌంటీ షెరిఫ్‌ బారీ ఫైలీ చెప్పారు. పటేల్ హత్యకు గురైన సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లో ఉన్నారు. స్థానికులు పటేల్ మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు. పటేల్ చాలా మంచివ్యక్తని, ఇలా జరుగుతుందని ఊహించలేదని స్థానికులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles