ధోని ది గ్రేట్.. టీ షాప్ ఓనర్ ముఖంలో వెలుగులు నింపాడు | Dhoni respect his tea seller friend.

Finally tea seller came to meet his friend dhoni

MS Dhoni Tea Seller, Tea Seller Dhoni, MS Shoni Chaiwala, Chaiwala Close Friend Dhoni, Dhoni Meet Old Friends, Dhoni Friendship, MS Dhoni Thomas

Indian Former Captain MS Dhoni is always known for his polite behavior for his fans and his friends. When he was TTE, he always goes for tea in to Thomas stall twice or thrice a day. He loved to spent times on his tea stall with his friends. Now Dhoni is a successful cricketer and got lots of fame. During a Vijay Hazare Trophy match, when Dhoni came from the dressing room, he saw Thomas standing outside. MSD easily recognized him and hugged him. He also invited him for the dinner. That gesture proved that, why Dhoni is known as a legend. MS Dhoni is playing Vijay Hazare Trophy, where he is the captain of Jharkhand team. He already scored a century and his team is also playing well.

ఆ ఛాయ్ వాలా అంటే ఎందుకంత అభిమానం

Posted: 03/01/2017 01:16 PM IST
Finally tea seller came to meet his friend dhoni

విజయ తీరాలతో ఉన్నత శిఖరాలను అందుకున్న ధోనీ సారథిగా బాధ్యతలు త్యజించటంతో ఇప్పుడు సాధారణ జీవితం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నాడు. దేశానికి గర్వకారణమైన కెప్టెన్ కూల్ బ్యాటింగ్ లోనే కాదు, స్వతహాగా వ్యక్తిత్వంలోనూ కొన్ని మెరుపులు మెరిపిస్తుంటాడు. సాధారణంగా పాపులర్ అయిపోగానే తమ పాత లైఫ్ స్టైల్ ను మరిచిపోయే సెలబ్రిటీల లిస్ట్ లో ధోనీ ఎంత మాత్రం ఉండడు. ఎందుకంటే వీలు చిక్కినప్పుడల్లా తన స్నేహితులను కలిసి పాత రోజులను గుర్తు చేసుకునే ఈ స్టార్ క్రికెటర్ అందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోడు.

ముఖ్యంగా స్నేహానికి ధోనీ ఎంత విలువ ఇస్తాడో రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా మరోసారి బయటపడింది. థామస్ అనే వ్యక్తి ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ బయట ఓ చిన్న టీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. పదమూడేళ్ల క్రితం ధోనీ టీసీగా పని చేస్తున్న సమయంలో మూడు, నాలుగు సార్లు ఆ టీ స్టాల్ కి వెళ్లేవాడంట. అలా వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు కూడా. ఏళ్లు దొర్లిపోయాయి.. స్నేహితుడిగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడని సంతోషం తప్ప థామస్ కి ధోనీని కలిసే అవకాశం రాలేదు. అయితే విజయ్ హజారే ట్రోఫీ కోసం ధోనీ వచ్చాడని తెలుసుకున్న అతగాడు వెంటనే ఈడెన్ గార్డెన్ మైదానంకు చేరుకుని కష్టం మీద డ్రెస్సింగ్ రూం దాకా చేరుకోగలిగాడు.

Dhoni Old Friend Thomas

ఇంతలో థామస్ ను చూసిన ధోనీ వెంటనే గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి అతగాడిని గట్టిగా వాటేసుకున్నాడంట. కాసేపు పాత స్నేహితుడితో సరదాగా బయట తిరిగిన ధోనీ డిన్నర్ కూడా చేసి అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పదమూడేళ్ల తర్వాత తన స్పెషల్ ఫ్రెండ్ ను కలుసుకున్న సంతోషం ఆ చాయ్ వాలా ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు తన షాప్ పేరును ధోనీగా మార్చుకునేందుకు డిసైడ్ అయ్యాడు కూడా.  ఈ డౌన్ టూ ఎర్త్ స్వభావమే బహుశా ధోనికి ఇంతటి ఫాలోయింగ్ ను కట్టబెట్టిందేమో కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Chaiwala  Friendship  

Other Articles