ఎన్నికల వేళ ఉత్తర్ ప్రదేశ్ లో కాల్పుల కలకలం Firing between SP and BSP supporters, 4 injured

Firing between samajwadi party bahujan samaj party supporters 4 injured

Siddha Gopal Sahu's son, shot attack, aridarman singh's son, Assembly Elections-2017, Bharatiya Janata Party (BJP), Congress, Samajwadi Party (SP), Uttar Pradesh Assembly Elections 2017

Four people including Samajwadi Party candidate Siddhgopal Sahu’s son have been injured in firing between SP and BSP supporters. The clashes between the two political parties started at around 4 in the morning.

ఎన్నికల వేళ ఉత్తర్ ప్రదేశ్ లో కాల్పుల కలకలం

Posted: 02/23/2017 11:12 AM IST
Firing between samajwadi party bahujan samaj party supporters 4 injured

నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌ లో కాల్పుల కలకలం సృష్టించాయి. అధికార సమాజ్ వాధీ పార్టీకి ప్రతిపక్ష బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి మధ్య రాజకీయ హత్యాప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే అన్ని పోలింగ్ బూత్ లలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు సమాయత్తమవుతున్న వేళ ప్రత్యర్థి కుమారుడిని హతమార్చుందుకు జరిగిన కాల్పులతో తెల్లవారక ముందే అక్కడి ప్రజలు కాల్పులు శబ్దంతో మేల్కోవాల్సి వచ్చింది. ఎన్నికల రోజున కాల్పలు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఓటింగ్ పై కూడా దీని ప్రభావం పడనుందని వార్తలు వినబడుతున్నాయి.

సమాజ్‌వాది పార్టీకి చెందిన నేత కొడుకుపై బీఎస్పీ నేత కుమారుడు దాడికి పాల్పడ్డాడు. అతడిపై బీఎస్సికి చెందిన నేతలు ప్రేరేపించిన వ్యక్తులు తుపాకితో కాల్పులు జరపడంతో ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ చర్యతో మహోబా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సిద్ధ గోపాల్‌ సాహు కుమారుడు పోలింగ్ నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో నలుగురు అగంతకులు అక్కడికి వచ్చి ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుడి పరిస్థితి విషమంగా వుండటంతో.. పాటు అతని వెంటనున్న అనుచరులకు కూడా గాయాలయ్యాయి.

గుర్తు తెలియని అగంతకులు సిద్ధ గోపాల్‌ సాహు కుమారుడిపై కాల్పులు జరిపి పారిపోయారు. గురువారం వేకువ జామును నాలుగు గంటలకు జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే బాధితులను కాన్పూర్ లోని స్థానికంగా గల ప్రైవేటు అస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. . సిద్ధగోపాల్‌ కుటుంబం మాత్రం బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ నేత అరిదర్మాన్‌ సింగ్‌ కుమారుడే ఈ దాడి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly polls-2017  BJP  Congress  Samajwadi Party  BSP  Uttar Pradesh Elections 2017  

Other Articles