ఫస్ట్ డే సీఎంగా పళని చేసిన పనితో వెయ్యి కోట్లు లాస్ | Palaniswami announces closure of 500 Tasmac shops.

500 liquor shops in tamil nadu closed

Tamil Nadu New CM, CM Palaniswami, Palaniswamy, Palaniswami Liquor Shops, CM Palanisamy Jayalalithaa Schemes, Jayalalitha Schemes Palaniswamy, Palaniswamy Day One

Palaniswami assumes charge as Tamil Nadu CM, signs 5 public welfare scheme files, including 500 liquor shops.

పళని పనితో వెయ్యి కోట్లు లాస్!

Posted: 02/22/2017 09:13 AM IST
500 liquor shops in tamil nadu closed

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన విషంయ తెలిసిందే. గతేడాది ఎన్నికల ముందు సమయంలో కూడా మరికొన్నింటిని అదనంగా జత చేర్చి మరీ మ్యానిఫెస్టో ప్రకటించిన అమ్మ ఆపై వాటిని అమలు చేసే లోపలే ఈ లోకాన్ని విడిచిపోయింది. అయితే అమ్మ వారసులుగా ఎవరు వచ్చినా సరే వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారా? అన్న సందేహం అందరిలోనూ కలిగాయి.

ఇక నూతన ముఖ్యమంత్రిగా బలపరీక్షలో విజయం సాధించిన ఎడప్పాడి పళనిస్వామి ఇప్పుడు అమ్మ మాట నిలబెట్టే యత్నం మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామి సోమవారం 500 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ప్రజలకు మరో నాలుగు వరాలు కూడా ప్రకటించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జయలలిత ముఖ్యమంత్రి కాగానే 500 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ఇవ్వగా, ఇప్పుడు మరో 500 షాపులను మూసేయాలని పళని ఉత్తర్వులు జారీ చేశాడు.

అయితే ఆ ఒకే ఒక్క ఆదేశంతో రాష్ట్రం అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలు నష్టపోనుంది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా 5,700 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది మార్చి నాటికి రూ.24 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందన్న ఓ అంచనా ఉంది. కాగా వచ్చే నెలలో సర్వే చేసిన అనంతరం రాష్ట్రంలో మూసివేయనున్న మద్యం షాపులను జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది.

ఇక వీటితో పాటు మహిళలకు అమ్మ టూ వీలర్ పథకం కింద వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు 50 శాతం సబ్సిడీ, గర్భవతులకు 18, 000 ప్రోత్సాహక నగదు, మత్సకారులకు 85 కోట్ల కేటాయింపులు, అన్ని ప్రాంతాలకు ఫ్రీగా మినరల్ వాటర్ సరఫరా, రైతులకు కరువు భత్యం విడుదల తదితరాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Palaniswamy  Welfare Schemes  

Other Articles