మానవ మృగం.. 200 రేప్ లు, 500 మర్డర్ లు... ISIS militant raped 200 women and killed 500 people.

This isis militant statement make us blood curdle

ISIS militant, Amar Hussein ISIS, Terrorist Amar Hussein, ISIS Rape Kill, ISIS Sex Slavery, ISIS Massacre, Iraq Dabgerous ISIS militant, ISIS Kurdish, Yazidi Women ISIS, Yazidi Attack, Yazidi Terror Attack, ISIS Rapist Killer

Kurdish intelligence authorities arrested an ISIS operative 21 Years old Amar Hussein and his revelations have left the internet shaken. Not that ISIS treating people in the most inhuman ways is new knowledge but this militant talking about raping 200 women and killing 500 people in vivid detail is just horrifying.

200 రేప్ లు, 500 హత్యలు.. ఎవడు వాడు?

Posted: 02/20/2017 11:28 AM IST
This isis militant statement make us blood curdle

ఐఎస్ఐఎస్ ఈ పేరు చెబితే చాలూ ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడుతుంటాయి. ఏ రోజు ఏ మూలన ఈ రాక్షసులు నరమేధం సృష్టిస్తారోనన్న భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు బతుకుతున్నాయి. ముఖ్యంగా ఇస్లాం దేశాలైతే వారి కిరాతక క్రీడలకు బలిపశువుగా మారుతున్నాయి. నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులే వారు ఇలా మారటానికి కారణాలు. అయితే కేవలం వాటితో వారు సంఘవిద్రోహ శక్తులుగా మారుతున్నారన్నది విస్మయం కలిగించేదే. 

ఇదిలా ఉంటే ఇరాక్ లోని కుర్షిద్ ప్రాంతంలో ఓ కరడు గట్టిన ఉగ్రవాదిని సైన్యం అరెస్ట్ చేసింది. ఇక విచారణలో అతగాడు చెప్పిన విషయాలు విన్న అధికారులు గజగజ వణికిపోయారు. అతని పేరు అమర్ హుస్సేన్. ఇరాక్ ప్రాంతంలోని సింజార్ లో మైనార్టీ తెగకు చెందిన యాజీదీలను టార్గెట్ చేసిన ఐసిస్ ఇతన్ని ఆ ప్రాంతానికి ఇన్ ఛార్జీగా నియమించింది. మరి అతగాడు చేసిన దారుణాలు ఎలా ఉన్నాయో అతనే స్వయంగా చెబుతున్నాడు.

ఏడాది కాలంలో 500 మందిని మట్టుబెట్టిన అమర్, సుమారు 200 మహిళలను చెరిచాడంట. ముఖ్యంగా యాజీదీ తెగలో అందమైన అమ్మాయిలనే టార్గెట్ చేసిన అమర్ వాళ్ల ఇంట్లో ముందే అత్యాచారం చేసి ఆపై మొత్తం కుటుంబ సభ్యులను వరుసబెట్టి కాల్చి చంపేవాడంట. ఇలా రోజుకు 40 మంది చొప్పున తానొక్కడే ఏడాదిలో 500 మందిని చంపినట్లు గర్వంగా చెప్పుకుంటున్నాడు. బాగ్దాద్ కు చెందిన తాను ఓ అనాథనని, చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవితం గడిపేవాడని అమర్ తెలిపాడు.

బతకాడానికి ఎలాంటి ఉద్యోగం దొరక్కపోవటంతో స్నేహితుల సలహా మేరకు తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తీవ్రవాదులతో చేతులు కలిపాడంట. 2013 లో ఐఎస్ఐఎస్ లో చేరినట్లు శిక్షణ తీసుకున్నాడంట. ‘నేను చేసేది తప్పు అని నాకు చెప్పేవారు లేరు.. అందుకే ఇలా మానవ మృగంలా తయారయ్యాను’ అని అంటున్నాడు 21 ఏళ్ల అమర్. త్వరలోనే అతనికి బహిరంగ మరణశిక్ష అమలు చేస్తామని సైన్యాధికారులు ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iraq  ISIS militant  Amar Hussein  

Other Articles