ఆడతది.. ఎందుకు ఆడదు? పీవీ సింధు వాలీబాలే ఆడతది!!!... MLA mistakenly says PV Sindhu as Volley Ball Player.

Mla comments on pv sindhu

MIM MLA Mumtaz Ahmed, Mumtaz Ahmed PV Sindhu, PV Sindhu Volley Ball Player, Jaleel Khan B Com, B Com Maths Physics, MLA Jaleel Khan Mumtaz Ahmed, Badminton or Volley Ball Player, Another Jaleel Khan, Telangana Jaleel Khan, MLA Comments on PV Sindhu, Sindhu Volley Ball Player Comments

MIM MLA Mumtaz Ahmed says PV Sindhu as National Volley Ball Player. Before that that mistake even confirmed by Deputy CM Mohammed Mahmood Ali Sahab.

ITEMVIDEOS:పీవీ సింధును అంత మాట అన్నాడేంటి?

Posted: 02/18/2017 12:46 PM IST
Mla comments on pv sindhu

మన రాజకీయ నాయకులకు మిగతా రంగాల్లో ఎంత అవగాహాన, పరిజ్నానం ఉందన్న విషయం మరోసారి రుజువయ్యింది. హైదరాబాద్ లో ఓ కార్యక్రమం సందర్భంగా ఓ ఎమ్మెల్యే, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధూపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఆయన ఏమన్నాడు?

శుక్రవారం చార్మినార్ నుంచి బార్కస్ వరకు తెలంగాణ పోలీస్ శాఖ 5కే రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని తోపాటు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీలతోపాటు పీవీ సింధు కూడా హజారయ్యింది. ఇక సింధును ఉద్దేశించి ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ తరపున అంతర్జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడిన సింధుకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అంతే ఆ మాటకు సింధుతో సహా అక్కడున్న వారంతా చిన్నగా నవ్వుకున్నారు.

 

 

బ్యాడ్మింటన్ తో ప్రపంచానికి హైదరాబాద్ పేరును ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే, వాలీబాల్ అంటూ వ్యాఖ్యానించటంతో మీడియాలో హైలెట్ అవుతోంది. పైగా ఆ వ్యాఖ్య చేసే ముందు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీని అడిగి మరీ కన్ఫర్మ్ చేసుకోవటం విశేషం. మొన్నామధ్యే ఏపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇంకా జోకుల రూపంలో కనిపిస్తూనే ఉండగా, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా అలాంటి వ్యాఖ్యలు చేయటం విశేషం. ఇక మన నేతల తెలివితేటల చూసిన సామాన్యులు ఔరా అంటూ షాక్ అవుతున్నారు.

 

ఇది కూడా చదవండి... 

ఉంటది.. ఎందుకు ఉండదు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  MLA Mumtaz Ahmed  Volley Ball Player Comments  

Other Articles