వీడియో వైరల్: మ్యాథ్స్, ఫిజిక్స్ తో.. జలీల్ ఖాన్ బీకాం డిగ్రీ MLA Jaleel khan did his BCom with Physics, Maths

Viral video mla jaleel khan studied maths physics in his b com

TDP MLA Jaleel khan, Jaleel khan, vijayawada west mla Jaleel khan, MLA Jaleel khan, Vijayawada, mla, mathematics, physics, Tdp Mla jaleel khan, bcom, uneducated

Jaleel Khan is an MLA of Vijayawada West constituency, who declared that he studied maths, physics in his B.Com. jaleel khan elected from ysrcp party and presently representing Tdp

ITEMVIDEOS: వీడియో వైరల్: మ్యాథ్స్, ఫిజిక్స్ తో.. జలీల్ ఖాన్ బీకాం డిగ్రీ

Posted: 12/29/2016 12:16 PM IST
Viral video mla jaleel khan studied maths physics in his b com

ఆయన ఓ అధికార పార్టీ తరపున రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినథ్యం వహిస్తున్న శాసనసభ్యుడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గెలుపోందిన నేతలు మర్చిపోతుంటారన్న టాక్ ఇప్పటికీ ప్రజల్లో వుంది. అయితే ఈ ఎమ్మెల్యే హామీలను పక్కనబెడితే.. తాను చదివానని చెప్పుకుంటున్న బికాం డిగ్రీలోని సబెక్టులను కూడ మర్చిపోయారు. ఎంతలా అంటే ఆయన తాను చదివిన బికాంలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు వున్నాయని ఏకంగా తెగేసి చెప్పారు.

అంతేకాదు ఆ సబ్జెక్టులంటే తనకు ఇష్టం కాబట్టే తాను బికాంను ఎంచుకున్నానని చెప్పడంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారి నెటజనులకు నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ అ ఎమ్మెల్యే ఎవరంటారా.. అయనే జ‌లీల్ ఖాన్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి.. టీడీపీలోకి జంప్ ఈయన గారి నాలెడ్జ్ కి నెట్ జనులు వ్యంగంగా కామెంట్లు కూడా పోస్టు చేస్తున్నారు.

వామ్మో జ‌లీల్‌ఖాన్ బీకాంలో మ్యాథ్స్‌, ఫిజిక్స్ ఏంట్రా బాబు.. మరీ ఇంత అవగాహన లేకుండా ఆయనెలా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ప్రశ్నలు వేసుకుంటున్నారా..? అయన ఈ అప్రస్తుత విషయాలను ప్రస్తావించడానికి కారణం ఏమిటీ అంటారా..? ఐడియల్ డ్రీమ్స్ అనే ఓ సంస్థ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ ను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ క్రమంలో జ‌లీల్‌ఖాన్ మాట్లాడుతూ తాను బీకాం చ‌దువుకున్నాన‌ని చెప్పారు. దీంతో చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుని రాజకీయాల్లోకి వచ్చారా..? మరెందుకు బీకాం తీసుకున్నారు.. అని యాంక‌ర్ ప్రశ్నించగా.. తనకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఇష్టమని అందుకే బీకాం తీసుకున్నానని జలీల్ ఖాన్ సమాధానమిచ్చారు.

దీంతో నివ్వెరపోయిన యాంకర్ మీరు బీకాం అంటున్నారు.. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఇష్టమంటున్నారు..? బికాంలో అవి వుండవు కదా.. అని ఒకింత ఆశ్యర్యానికి గురై అయోమయంలో తడబడుతూనే ప్రశ్నించారు. ఎందుకుండవ్.. వుంటాయ్ వుంటాయ్ అని జలీల్ ఖాన్ పూర్తి నమ్మకంతో సమాధానం ఇచ్చారు. షాక్ అయిన యాంక‌ర్ మ్యాథ‌మాటిక్స్ అంటే కామర్స్ వుంటుంది కాదా అనే లోపు జలీల్ ఖాను దానిని అందుకుని ‘ఆ.. అదే అది ఉంటే మ్యాథ్సే కదా’’ అని మ్యానేజ్ చేశారు.

అయితే బికాంలో ఫిజిక్స్ మాత్రం ఉండ‌దు అని యాంకర్ ఖరాఖండీగా చెప్పాడు. దీంతో అప్పట్లో ఏదో చదువుకున్నా ఏం ఏం వున్నాయో ఒకోసారి చూస్తే తెలుస్తుందని అని మాటదాటవేశారు. ఏదో ఇంటర్వ్యూ చేసుకుందామని ప్రయత్నించిన యాంకర్ కు మంచి కామెడీ సీన్ దోరకడం..దాంతో ఆయన దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం.. దానిని వీక్షకులు మరీమరీ చూడటంతో చకచకా జరిపోతుంది. మరెందుకు అలస్యం మీరూ చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  jaleel khan  mla  mathematics  physics  bcom  UnEducated  TDP  Andhra pradesh  

Other Articles