పాకిస్థాన్ లో మరో నరమేధం వంద మంది ప్రాణాలు బలిగొంది. గురువారం రాత్రి సింధ్ ప్రావిన్స్ సెహ్వాన్ లో ఉన్న సుప్రసిద్ధ లాల్ షాబాజ్ కలందర్ దర్గాలో ఆత్మాహుతి దాడి జరిగింది. సూఫీ తెగ వారు పవిత్రంగా భావించే ఈ దర్గాలో ప్రతి గురువారం ప్రార్ధనలు నిర్వహిస్తారు. ప్రార్థనల అనంతరం ధమాల్ (సూఫీ నృత్య వేడుక) కూడా నిర్వహిస్తారు. సరిగ్గా ఆ సందడిలో ఉన్న భక్తులు ఆనందపరవశులై ఉండగా, మందిర ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తొలుత ఒక హ్యాండ్ గ్రెనేడ్ ను సూఫీ భక్తులపైకి విసిరాడు. అయితే అది పేలలేదు. దీంతో మరింత ఆగ్రహంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది.
అప్పటివరకు నృత్యాలతో సంతోషంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసిన రక్తమోడుతూ రక్షించాలన్న ఆర్తనాదాలు వినిపించాయి. శరీర భాగాలు ఖండఖండాలుగా ఎగిరిపడ్డాయి. భారీ శబ్దంతో దర్గాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. తొలుత వారు కూడా అక్కడి భీతావహ దృశ్యాలు చూసి బెంబేలెత్తిపోయారు. అయితే అక్కడి బాధితుల పరిస్థితి, ఆర్తనాదాలు విని చలించిపోయి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం మృతుల్లో 12 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. 250 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇక్కడికి 40-50 కిలోమీటర్ల వరకు ఒక్క ఆసుపత్రి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
కాగా, సహాయక చర్యల కోసం సాయుధ దళాలను, సైన్యానికి చెందిన సి-130 విమానాన్ని, నేవీ హెలికాప్టర్ ను రంగంలోకి దించినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. ఘటనాస్థలిలో అత్యవసర చికిత్సలందించేందుకు జమ్ షోరో, నవాబ్ షా, హైదరాబాద్ ల నుంచి వైద్యులను రంగంలోకి దించినట్టు కూడా ఆయన వెల్లడించారు. కాగా, ఈ బాంబుదాడి చేసింది తమ సైనికుడేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. దీంతో సింధ్ ప్రావిన్స్‌లోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, దాడిని ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more