బీజేపీ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ ఫోటోలు.. మహిళా నేతలు ఏం చేశారంటే... | Gujarat women BJP supporters left the group.

Obscene photos on the bjp official whatsapp group

Former Gujarat BJP Mayor, Rajubhai Desai, BJP Whats app Group, Gujarat Women BJP Supporters, Porn Clips in Party Group, Whats App Group Porn Content, Gujarat BJP Leader Sex Racket, BJP Leader orn Photos, Gujarat BJP Whats app Group

Former Gujarat BJP mayor Rajubhai Desai faces heat for posting porn images on party’s WhatsApp group. Several women BJP supporters left the group, which was essentially created to keep workers abreast of the party’s programmes on a regular basis. Desai, for his part, denied that he had deliberately sent the images to the group adding that the porn photos were accidently shared in the group due to a technical fault.

షాక్ : బీజేపీ వాట్సాప్ గ్రూప్ లో పొర్న్ ఫోటోలు

Posted: 02/14/2017 09:57 AM IST
Obscene photos on the bjp official whatsapp group

అధికార పార్టీలో ఉన్న వారిపై విమర్శలు రావటం సహజమే అయినప్పటికీ లైంగిక తరహావి వస్తే మాత్రం ప్రతిపక్షాలు పేకాట ఆడేసుకుంటాయి. గుజరాత్ లో కొద్ది రోజుల క్రితం ఓ నేత సెక్స్ రాకెట్ నడుపుతూ పట్టుబడటం ఆపై పార్టీ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం చక చకా జరిగిపోయాయి. రాజకీయ విమర్శల సంగతి ఏమోగానీ సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో పెద్దాయన యవ్వారం వెలుగు చూసింది.

ఏకంగా పార్టీ వాట్సాప్ గ్రూప్ లోనే పోర్న్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. సూరత్ మాజీ మేయర్, రాజుభాయ్ దేశాయ్ పిబ్రవరి 9న బీజేపీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో ఈ నిర్వాకం చేశారు. ఆయన ఇలా ఆ పనిచేయగానే ఆ గ్రూప్ లో ఉన్న మహిళా సభ్యులు వెంటనే గ్రూప్ నుంచి లెఫ్ట్(వదిలేశారు) అయిపోయారు. ఇక ఈ విషయం వెంటనే తెలుసుకున్న అధిష్టానం వెంటనే ఆ గ్రూప్ ను డిలేట్ చేసేసింది. అయితే అప్పటికే ఆ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. తాను కావాలని ఆ పని చేయలేదంటూ దేశాయ్ చెబుతున్నాడు.

దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ థాకర్ దేశాయ్ నుంచి వివరణ కోరటమే కాదు, ఆయన తప్పు ఉందని తేలితే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం కట్చ్ జిల్లాలో 24 ఏళ్ల యువతిని 8 మంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో బీజేపీ నేతలు కూడా ఉన్న విషయం తెలిసిందే. రేప్ చేసి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసే ఈ సెక్స్ రాకెట్ ముఠాలో అధికార పార్టీ సభ్యుడు, అతని అనుచరులు ఉండటం సంచలనంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  BJP  Rajubhai Desai  Porn Photos  Whats App Group  

Other Articles