లాలూ ఈసారికి కుర్చీని క్షమించేశాడు | Lalu says this Chair Is For Nitish Kumar.

Lalu politely vacate the chair for nitish kumar

Lalu Prasad Yadav, Lalu Prasad Yadav Chair, Nitish Kumar Chair, Nitish Kumar Lalu Prasad Yadav, Lalu Vacate Chair, Lalu Sacrifice Chair, Lalu Prasad Yadav Funny Video, RJD Chief Lalu Prasad Yadav

Lalu Prasad Yadav a public function in Patna, he was asked politely to vacate the chair he had occupied with the organisers explaining it was reserved for the Chief Minister. Mr Yadav did as requested without any fuss. When Mr Kumar arrived, he was escorted to the chair in question. Mr Yadav was seated one spot away in the VIP line-up on the same stage.

తమ్ముడి కోసం లాలూ ఎంత పెద్ద త్యాగం!

Posted: 02/13/2017 09:56 AM IST
Lalu politely vacate the chair for nitish kumar

తన చేష్టలు, స్టేట్ మెంట్లతో తరచూ వార్తల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి హైలెట్ అయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లాలూకు మధ్య ఎంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలిసిందే. మోదీ ఎంట్రీ కారణంగా బీజేపీతో కటీఫ్ తర్వాత ఆ సమయంలో నితీశ్ కు బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది లాలూనే. తాను తిరిగి అఖండ విజయంతో మళ్లీ సీఎం గద్దె ఎక్కానంటే అందుకు ఆర్జేడీ మద్ధతు, లాలూ ప్రోత్సాహాం చాలా ఉందంటూ నితీశ్ తరచూ చెబుతుంటాడు. ఆ చనువుతోనే లాలూను ‘పెద్దన్న’ అని పిలుచుకుంటాడు కూడా.

నితీశ్ అభిమానం అనుమానం లేకపోయినప్పటికీ, తాజాగా జరిగిన ఓ ఉదంతం లాలూకి కూడా నితీశ్ ఎంత ప్రేమో తెలియజేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన లాలూ తనకు కేటాయించిన సీటులో కాకుండా తొలుత సీఎం కుర్చీలోనే కూర్చున్నాడు. ఇంతలో నితీశ్ వస్తుండటం గమనించిన నిర్వాహకులు ఆయన్ను లేవాల్సిందిగా సైగా చేశారు. వెంటనే అర్థం చేసుకున్న లాలూ ఏ మాత్రం మొహమాట పడకుండా లేచి పక్కదాంట్లో కూర్చున్నాడు. ఓ సీనియర్ అయి ఉండి కూడా లాలూ వ్యవహరించిన తీరు హుందాగానే కాదు, లాలూపై అభిమానం కూడా చాటుకున్నాడంటూ అక్కడి మీడియా కథనాలు రాసింది.

 

ఇదిలా ఉంటే కొన్ని వారాల క్రితం గురుగోవింద్ సింగ్ 350 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి లాలూకు కూడా ఆహ్వానం అందించింది. అయితే వారి పక్కన తనకు కుర్చీ కేటాయించకపోవటంతో అవమానభారంగా ఫీలయిన లాలూ బహిరంగంగానే కామెంట్లు చేశాడు కూడా. దీంతో ఆర్జేడీ-జేడీయూ మధ్య గ్యాప్ మొదలైందా? అన్న పుకార్లు రేగాయి.

ఇక నోట్ల రద్దును సోపోర్ట్ చేస్తూ నితీశ్ వ్యాఖ్యలు చేయటం, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే. మరోవైపు పాట్నాలో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో లిక్కర్ బ్యాన్ అంశంపై నితీశ్ పై పొగడ్తలు కురిపించాడు. ఈ నేపథ్యంలో వాళ్ల మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Nitish Kumar Yadav  Chair Sacrifice  

Other Articles