ధాయధిపై విజయం.. భారత్ ఖాతాలో మరో వరల్డ్ కప్ India defeats Pakistan, wins T20 Blind World Cup trophy

India beat pakistan by nine wickets to win t20 blind world cup

india vs pakistan, ind vs pak, india pakistan t20 world cup blind, t20 blind world cup, india pakistan t20 blind world cup final, t20 world cup for the blind, t20 visually impaired world cup, india pakistan cricket, cricket news, blind cricket, sports news

India successfully defended their title in the T20 Blind World Cup on Sunday at M. Chinnaswamy Stadium in Bangalore by beating arch-rivals Pakistan in the final by nine wickets.

ధాయధిపై విజయం.. భారత్ ఖాతాలో మరో వరల్డ్ కప్

Posted: 02/12/2017 04:29 PM IST
India beat pakistan by nine wickets to win t20 blind world cup

అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ జట్టు మరోమారు టైటిల్ను నిలబెట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ను మరోసారి ఎగురేసుకుపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ జట్టు 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని లీగ్ దశలో పాక్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. క్రితంసారి పాకిస్తాన్ ను ఓడించి కప్ ను సాధించిన భారత్ అదే పరంపరను మరోమారు కొనసాగించింది.

ఇవాళ జరిగిన తుది పోరులో తమకు తిరుగులేదని భారత ఆటగాళ్లు మళ్లీ దాయాధికి నిరూపించారు. భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య(99 నాటౌట్) మరోసారి విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి జతగా అజయ్ కుమార్ రెడ్డి(43) ఆకట్టుకున్నాడు. మరొక ఆటగాడు కేతన్ పటేల్(26) రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs pakistan  t20 blind world cup  india  pakistan  cricket  

Other Articles