రేపిస్టులను చిత్రహింసలు పెట్టాం: ఉమాభారతి సంచలనం Uma Bharti Says As Chief Minister, 'Tortured Rapists Till They Begged'

Uma bharti says as chief minister tortured rapists till they begged

Uma Bharti, Bulandshahr rape, rapists torture, rapists should be tortured, Agra rally, Uma Bharti rape comments, Uttar Pradesh elections, India news, latest news

Union Minister Uma Bharti told a large crowd while campaigning in Uttar Pradesh that she made rapists "beg for forgiveness" when she was Chief Minister.

రేపిస్టులను చిత్రహింసలు పెట్టాం: ఉమాభారతి సంచలనం

Posted: 02/10/2017 05:42 PM IST
Uma bharti says as chief minister tortured rapists till they begged

దేశంలోనే అత్యంత పెద్దదైన, అత్యధిక నియోజకవర్గాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతకు మరికొన్ని గంటల వ్యవధిలో ఓటింగ్ ప్రారంభం కానుంది. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 15 జిల్లాల్లోని 73 నియోజక వర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్సీ.. కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పోటీ నెలకొంది. 2012లో ఇక్కడి నుంచి బీజేపీ 11 సీట్లను గెలుచుకుంది. బీఎస్పీ 23, ఎస్పీ 24, కాంగ్రెస్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. ఈసారి ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సమాజ్‌ది, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి.

అయితే ఈ ఎన్నికలలో ఎలాగైన తమ సత్తాను చాటుకోవాలని కేంద్రంలోని అధికార బీజేపి ప్రయత్నాలు రచిస్తుంది. కాగా దేశంలో అత్యాచారాలు పెరుగుకుపోతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని, అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ అందోళన కలిగిస్తుందని కేంద్రమంత్రి ఉమా భారతి అరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్న హాయంలో క్షమించమని నిందితులు వేడుకునేవరకు, బాధితుల ముందు వారికి చిత్రహింసలు పెట్టాలని అన్నారు.

తాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచార నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించానని చెప్పారు. 'రేపిస్టులను తల కిందలుగా వేలాడతీసి చిత్రహింసలు పెట్టాలి. గాయాలకు కారం చల్లాలి. ఏడుస్తూ క్షమించమని వేడుకునేవరకు ఇలాగే చేయాలి. ఈ దృశ్యాలను మహిళలు దగ్గర నుంచి చూడాలి' అని ఉమాభారతి అన్నారు. బులంద్‌షార్ అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కనీసం ప్రయత్నించలేదని విమర్శించారు.

గతేడాది ఢిల్లీకి సమీపంలో హైవేపై వెళ్తున్న వాహానాన్ని ఆపి, తల్లీకూతుళ్లపై సామూహిక లైంగికదాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పదేళ్ల క్రితం తాను మధ్యప్రదశే్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రేపిస్టులను పోలీస్ స్టేషన్‌లో తలకిందులు వేలాడతీసి చిత్రహింసలు పెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించానని, ఆ దృశ్యాలను కిటికీల ద్వారా చూడాలని మహిళలకు చెప్పానని ఉమాభారతి చెప్పారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా, రాక్షసులకు మానవహక్కులు ఉండవని, రావణుడిని చంపినట్టు వారి తలలను నరికివేయాలని చెప్పానని వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uma Bharti  Rapists  chief minister  uttarpradesh  elections-2017  politics  

Other Articles