తమిళనాట గుడుగుడు గుంచెం గుండే రాగం.. who will be the chief minister of tamilnadu

Who will be the chief minister of tamilnadu

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabiner minister, deepa jayakumar, tamil nadu politics

tension arose in tamil nadu politics as rumours are heard that the present chief minister paneer selvam is dishonouring to resign

తమిళనాట గుడుగుడు గుంచెం గుండే రాగం..

Posted: 02/05/2017 10:54 AM IST
Who will be the chief minister of tamilnadu

తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేందుకు పన్నీరు సెల్వం ససేమిరా అంటున్నారని, అయితే అతడ్ని దించేయడానికి ఇప్పటికే రంగం సిద్దమైందన్న వార్తల నేపథ్యంలో తమిళనాట గుడుగుడు గుంచెం గుండే రాగం అంటూ సీఎం పదవిపైన ఎవరు కొనసాగునున్నారన్న ఉత్కంఠ రేపుతుంది. చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సన్నద్ధమవుతుండటంతో.. అధికార అన్నాడీఎంకేలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్టు తెలుస్తోంది. పన్నీర్‌ సెల్వాన్ని సీఎం పదవి నుంచి దింపేసి.. ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టేందుకు శశికళ పూర్తి ఏర్పాట్లు చేసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి.

శశికళ నిర్వహించేబోయే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశంతో ఇందుకు పునాది పడనుందని, ఈ నెల 6న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కథనాలు వస్తున్నాయి. మరోవైపు తన పదవికి ఎసరు పెట్టేందుకు శశికళ వేస్తున్న ఎత్తులను ప్రస్తుతం సీఎం పన్నీర్‌ సెల్వం కూడా గట్టిగా తిప్పికొడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ఆయన ససేమిరా అంటున్నట్టు సమాచారం. పదవి నుంచి తప్పుకొని.. శశికళకు మార్గం సుగమం చేయాలని ఆమె వర్గం ఒత్తిడి తేస్తున్నా.. అందుకు సెల్వం సిద్ధంగా లేరన్నదని తాజా తమిళ మీడియా కథనాల సారాంశం.

కేంద్రంలో బీజేపీ సర్కారు అండ ఉండటంతోపాటు జయలలిత మేనకోడలు దీపాకుమార్‌ మద్దతును కూడా ఆయన తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దీపాకుమార్‌ టచ్‌లో ఉన్నట్టు సమాచారం. శశికళను తమ నాయకురాలిగా ఒప్పుకోని అన్నాడీఎంకే శ్రేణులు దీపకు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ వర్గానికి చెక్‌ పెట్టేందుకు పన్నీర్‌ సెల్వంకు అండగా నిలబడాలని దీప కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో శశికళ, సెల్వం వర్గాల మధ్య అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోయే అవకాశముందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles