తిరుమలలో అకతాయిలు ఏం చేశారో తెలుసా..? What mischiefs done in Tirumala, how a fire broke up..?

What mischiefs done in tirumala how a fire broke up

fire accident, tirumala, cottages room, old police station, mischevous people, fire tenders, dormatory, tension in devotees, tirumala officials

mischievous people in tirumala, has burnt garbage which arose to side domatory and suddenly heav fire broke out. fire tenders rushed to the spot and stopped the fire,

తిరుమలలో అకతాయిలు ఏం చేశారో తెలుసా..?

Posted: 02/05/2017 10:11 AM IST
What mischiefs done in tirumala how a fire broke up

తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనునిత్యం రద్దీగా వుంటే తిరుమలలో పాత పోలీస్‌స‍్టేషన్‌ సమీపంలోని అతిథి గృహం రూమ్‌ నంబర్‌ 264 లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు అప్రమత్తమయ్యారు. మంటలు అర్పేందుకు ప్రయత్నించి విఫలమై.. అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేశారు. భక్తులు గాఢ నిద్ర ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురయ్యారు.

వెంటనే వారు మేల‍్కొని మంటలను ఆర‍్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ‍్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన‍్లతో సిబ‍్బంది వచ్చి మంటలు ఆర‍్పారు. అప‍్పటికే ఆ గది పూర్తిగా కాలిపోయింది. అందులోని భక్తుల వస‍్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గది బయట చెత‍్తకుప‍్పకు ఆకతాయిలు నిప్పు పెట‍్టడంతో ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles