వంద కోట్ల భారతీయుల రక్షణ కోసం సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్ల దీన స్థితిని వివరిస్తూ సత్కారంగా తమకు ఎంతటి చెత్త తిండి పెడుతున్నారని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసిన జవాన్ గుర్తున్నాడా? ప్రస్తుతం ఆ తేజ్ బహదూర్ పరిస్థితి దారుణంగా మారిందని ఆయన భార్య షర్మిల యాదవ్ ఆరోపిస్తోంది. తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి.. చిత్ర హింసలకు గురి చేస్తున్నారని.. ఆ విషయాన్ని భర్తే తనకు ఫోన్ చేసినట్లు చెప్పినట్లుగా చెబుతోంది ఆమె. ఓ పక్కన ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో మరో ఉదంతం గుండెను కదిలించి వేస్తోంది.
కశ్మీర్ కుప్వారా జిల్లా కర్ణ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్బాస్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 60 ఏళ్ల తల్లి షేకీనా బేగం అతనితోనే ఉంటోంది. గత ఐదు రోజుల క్రితం తీవ్ర గుండెపోటుతో ఆమె మృతి చెందింది. తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు స్వగ్రామంలోనే చేయాలని భావించాడు. అందుకోసం కశ్మీర్‌కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. ఆ సమయంలో 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండ చరియ విరిగి పడడంతో స్పందించిన అధికారులు ఆ జవానుకు హెలికాప్టర్ ద్వారా సాయం చేస్తామని అన్నారు. తన తల్లి మృతదేహాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్ కోసం ఎదురు చూసిన జవానుకు నిరాశే మిగిలింది. నాలుగు రోజులుగా హెలికాఫ్టర్ రాలేదు.
ఎంతకీ హెలికాప్టర్ రాకపోవడంతో బంధువులు వారిస్తున్నా వినకుండా తల్లి మృతదేహాన్ని తన భుజాన వేసుకొని అబ్బాస్ సుమారు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు నడిచాడు. ఆయనకు మరికొంతమంది సాయం చేశారు. ఇది తనకు జరిగిన పెద్ద అవమానమని, తన తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయానని ఆ జవాను ఆవేదన వ్యక్తం చేశాడు. తమ అధికారులు తనకు సాయం చేయడానికి హెలికాప్టర్ పంపిస్తామని చెప్పి ఎంతకూ పంపించలేదని అన్నాడు. తాను మంచుముక్కలపై ప్రమాదకర స్థితిలో నడుచుకుంటూ తన తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లానని చెప్పాడు.
పక్కన తల్లి శవాన్ని పెట్టుకుని నాలుగు రోజుల పాటు ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. అంతేగాక, ఈ రోజు తన ఫోన్ కూడా కట్ చేశారని ఆయన చెప్పాడు. అందుకే తాను తన తల్లిని భుజంపై మోసుకెళ్లాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ తాము ఈ రోజే హెలికాప్టర్ సిద్ధం చేశామని అన్నారు. అయితే, హెలికాప్టర్ దిగే చోటులేకపోవడంతో వారే వద్దన్నారని అంటున్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే యోధులకు ఇలాంటి అవమానాలేంటంటూ ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more