మహిళల పెత్తనం మూలంగా ఆ రాష్ట్రం తగలబడుతోంది | Protesters set government buildings ablaze over reservation for women.

Women reservation violence escalates in nagaland

Nagaland, Nagaland News, Nagaland Women reservation, Women reservation ULB Elections, ULB Elections Nagaland, Urban Local Bodies Elections, Nagaland Chaos, Nagaland Protestors

Women reservation: Violence escalates in Nagaland; mob burn govt offices, vehicles.

రాష్ట్రంలో రాజుకున్న రిజర్వేషన్ల చిచ్చు

Posted: 02/03/2017 08:07 AM IST
Women reservation violence escalates in nagaland

స్థానిక సంస్థలు పెట్టిన చిచ్చుతో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ తగలబడుతోంది. పలు డిమాండ్లతో రోడ్డెక్కిన నిరసన హింసాత్మకంగా మారింది. వీధుల్లోకి చేరిన ఆందోళనకారులు లూఠీలు చేయటంతోపాటు ఆస్తులను భారీగా తగలబెడుతున్నారు. ముఖ్యంగా రాజధాని కొహిమాలో ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టేశారు. దీమా పూర్ లో పలు వాహనాలకు నిప్పు పెట్టి భారీ నష్టం వాటిల్లేలా చేశారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గత రెండు రోజులుగా ఇక్కడ నిరసనలు జరుగుతున్నప్పటికీ… నిన్న అవి తారా స్థాయికి చేరుకున్నాయి. మహిళల రిజర్వేషన్లను రద్దు చేయటంతోపాటు, ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లతో ప్రస్తుతం అక్కడి ఆందోళనలు ఉదృతంగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన అధికారులను కూడా సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సమస్య ఏంటంటే...

నాగాలాండ్ లో గిరిజన సాంప్రదాయం ప్రకారం రాజకీయాల్లో మహిళలు జోక్యం చేసుకోకూడదు. కానీ, ప్రభుత్వం మాత్రం 33 శాతం రిజర్వేషన్ల ఆధారంగా వారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో సీట్లు కేటాయించింది. దీంతో కొన్ని గిరిజన తెగలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గువాహటి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. రాజ్యాంగంలోని 371(ఏ) ప్రకారం ఏ ప్రభుత్వం కూడా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకూడదన్న పాయింట్ ను వినిపించాయి. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాలను ప్రారంభించింది. దీంతో ఆయా తెగలు ఆందోళనలు చేపట్టాయి. శుక్రవారం సాయంత్రం లోగా ముఖ్యమంత్రి టీఆర్ జీలియంగ్, మంత్రులంతా రాజీనామా చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నాయి.

ఇక ఆందోళనలు తారాస్థాయికి చేరటంతో గురువారం రాత్రి సుమారు 400 మంది సైనికులు రాజధాని నగరం కోహిమా చుట్టూ మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే మరికొద్ది రోజులు కర్ఫ్యూ కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. మొత్తం 32 స్థానాల్లో పదకొండు స్థానాలకు ఫిబ్రవరి 1న ఎన్నికలు జరిగాయి కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 144 సెక్షన్ విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagaland  Women reservation  Chaos  Protestors  

Other Articles