స్పెషల్ స్టేటస్ కేంద్రం ఇవ్వలేదు.. కానీ, ఆయన ఇచ్చేశాడు | Venkaiah Naidu on AP allocations in Budget 2017.

Venkaiah naidu says ap a special state for the centre

Union Minister Venkaiah Naidu, Venkaiah Naidu AP Special Status, AP Budget Allocations, Union Budget 2017, Venkaiah Naidu Union Budget, Union Budget Andhra Pradesh Allocations, AP a Special State

Union Minister Venkaiah Naidu on budget allocations says AP a special State for the Centre. But, alliance TDP not satisfied.

కేంద్రానికి ఏపీ సమ్ థింగ్ స్పెషల్?

Posted: 02/02/2017 09:35 AM IST
Venkaiah naidu says ap a special state for the centre

సామాన్య, మధ్యతరగతివారికి బడ్జెట్‌ అనుకూలంగా ఉందంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం తుస్సుమనిపించారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు నితీశ్, మమతా బెనర్జీలాంటి వాళ్లు కూడా అంకెలగారడీ తప్ప మరేం లేదంటూ పెదవి విరిచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో హోదా ఇవ్వకుండా, మరోవైపు ప్యాకేజీ విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్న కేంద్రం బడ్జెట్ విషయంలో కూడా పెద్దగా వరాలు ప్రకటించలేదు. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని కేంద్రం అడాప్ట్‌ చేసుకోవడం, రైతులకు టాక్స్ మినహాయింపులు మాత్రం కొంచెం ఊరటనిచ్చే అంశాలు.

ఇక ఇలా బడ్జెట్ ముగిసిందో లేదో అలా రంగంలోకి దిగిన వెంకయ్య నాయుడు ఏపీ వరాలంటూ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. తమ (కేంద్ర ప్ర‌భుత్వం) దృష్టిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకమని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు అన్నాడు. కేవ‌లం మాట‌ల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నామ‌న్నాడు. బ‌డ్జెట్‌ రైతులకు మేలు క‌లిగించేలా ఉంద‌ని, రాజ‌ధాని రైతుల‌కు మేలు క‌లిగేలా ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌న్న అంశాన్ని సానుకూలంగా ప‌రిశీలించిన‌ అరుణ్‌జైట్లీ... ఆ విష‌యాన్ని పొందుపరిచారని చెప్పాడు. తద్వారా నవ్యాంధ్రపై కేంద్రానికి ప్ర‌త్యేకదృష్టి ఉంద‌ని మ‌రోసారి రుజువ‌యిందంటూ చెప్పుకొచ్చాడు.

ఇక కేంద్ర బ‌డ్జెట్‌లో అమ‌రావ‌తి మెట్రోకు రూ.100 కోట్ల కేటాయింపులు గురించి ప్రస్తావించిన ఆయన, పీఐబీ అనుమ‌తి వ‌చ్చాక నిధులు పెరిగే అవ‌కాశం ఉందన్నాడు. ఇక ఆయన వ్యాఖ్యలను చూసిన వారు ఎప్పటిలాగే వెంకయ్య పాతపాటే పాడాడంటూ లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు బడ్జెట్ లో విశాఖపట్టణానికి రైల్వేజోన్ ప్రకటిస్తారని ఆశించామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపాడు. రైల్వే జోన్ ప్రకటించకపోవడం పట్ల నిరాశ చెందామని, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి దీనిపై చర్చిస్తామని ఆయన తెలిపాడు కూడా. ఐటీ రంగానికి కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయకపోవటంపై ఏపీ సీఐఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  Venkaiah Naidu  Union Budget 2017  Andhra Pradesh  Allocations  

Other Articles