మావోల రివెంజ్ ఎంత ఘోరం.. 25 అడుగుల ఎత్తులో వేలాడిన జీపు | Odisha Police personnel killed in Maoist Revenge blast.

Seven policemen killed in koraput landmine blast

Koraput Blast, Landmine Blast, Maoist Revenge Blast, Malkangiri Encounter, Maoist Attack On Police Convoy, Odisha Maoist Attack, Maoist landmine blast, Police Vehicle Blown up

Maoist Attack On Police Convoy At Odisha-Andhra Pradesh Border. An IED went off when a vehicle carrying several policemen of the Odisha State Armed Police was on the Sunki-Salur highway. The vehicle was a part of a convoy, which was on its way to Angul Police Training College from Koraput.

మావోయిస్టుల ప్రతీకారం ఎంత దారుణంగా అంటే...

Posted: 02/02/2017 08:09 AM IST
Seven policemen killed in koraput landmine blast

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మరోసారి రక్తపుటేరు ప్రవహించింది. కీలక నేతలను మట్టుపెట్టిన మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. అదను చూసి పోలీసులే లక్ష్యంగా బుధవారం మెరుపుదాడి చేశారు. పోలీసులు(ఓఎస్ఏపీ జవాన్లు) వెళ్తున్న ఓ వ్యాన్ ను పేల్చేయటంతో 7 మంది మృతి చెందారు. వ్యాన్ లో మొత్తం 13 మంది ఉండగా, 11 మంది ఆచూకీ లభ్యం అయ్యింది. కాగా, మరో ఇద్దరు ఏమయ్యారన్నది అర్థం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు.

కోరాపూట్ జిల్లాలోని సుంకి వద్ద ఓ కల్వర్టు కింద బాంబు పెట్టి వ్యాన్ ను పేల్చేశారు. దీంతో వ్యాన్ తునాతునకలైంది. శకలాలు 25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకోవడం చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో వుందో ఊహించవచ్చు. దుస్తులు, ఆహారం చిందరవందరగా, చెల్లాచెదురుగా పడిపోయాయి. అమాంతం గాల్లోకి లేచిన వ్యాన్ ఓ చెట్టును ఢీ కొట్టి, దగ్గర్లోని లోయలో పడిపోయిందని సాక్షులు చెబుతున్నారు.

జీపులో ప్రయాణించిన 13 మంది సెలక్షన్ లో ఎంపికైనప్పటికీ ఏడాదిగా ఉద్యోగం పొందలేకపోయారు. కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయడంతో ఇటీవల ఉద్యోగ నియామక ఉత్తర్వులొచ్చాయి. ఈ ఉత్తర్వులతో వీరు పోలీసు జీపులో కోరాఫుట్‌ నుంచి కటక్‌కు శిక్షణకు వెళ్తుండగా మావోయి స్టుల దాడికి గురయ్యారు.

అందరికీ తలలకు గాయాలు కాగా, వారిలో 7 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఏమయ్యారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి 26 కావడంతో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, పేలుడు చీకటి పడిన తరువాత చోటుచేసుకోవడానికి తోడు సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడడం, కల్వర్టు కూలిపోవడంతో పారామిలిటరీ బలగాలతో సహాయకచర్యలకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక, రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు. సంఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు వందల మంది పోలీసులతో కూంబింగ్ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Koraput  Maoist  Landmine Blast  

Other Articles